📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత

Author Icon By Anusha
Updated: November 27, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు, విజయాలను సాధించిన రోహిత్‌ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఐసీసీ రాబోయే టీ20 ప్రపంచకప్ 2026 కోసం రోహిత్ శర్మ (Rohit Sharma) ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూనే ఐసీసీ మెగా టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.

Read Also: Smriti Mandhana: పలాశ్ ముచ్చల్ తో స్మృతి వివాహం జరిగేనా?

సచిన్‌ తర్వాత రోహిత్‌

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి రోహిత్ శర్మ (Rohit Sharma) ను ప్రచారకర్తగా ఐసీసీ నియమించడంతో హిట్‌మ్యాన్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. గతంలో 2011 వన్డే ప్రపంచకప్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. సచిన్ ఆ టోర్నీ ఆడుతూనే ప్రచారకర్తగా వ్యవహరించాడు.

టీ20 ప్రపంచ కప్ చరిత్రలో మాత్రం రోహిత్ శర్మ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు. మరే ఆటగాడు కూడా ఈ ఘనతను అందుకోలేదు. అంతేకాకుండా ఐసీసీ (ICC) టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన నాలుగో భారత ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. గతంలో యువరాజ్ సింగ్(2024 టీ20 ప్రపంచకప్), మహేంద్ర సింగ్ ధోనీ(2021 టీ20 ప్రపంచకప్), సచిన్ టెండూల్కర్(2016 టీ20 ప్రపంచకప్) ప్రచారకర్తలుగా వ్యవహరించారు.

Rohit Sharma’s rare feat

టీ20 ప్రపంచకప్‌లు ఆడిన రోహిత్ శర్మ

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ షెడ్యూల్‌ గత మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకటన కార్యక్రమానికి ఐసీసీ ఛైర్మెన్ జైషాతో పాటు రోహిత్ శర్మ, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ మెగా టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు జై షా ప్రకటించారు.9 టీ20 ప్రపంచకప్‌లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప రాయబారి ఎవరూ లేరని జై షా కొనియాడారు.

రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు.’భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ టీమ్ సారథి కావడంతో పాటు గత 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప బ్రాండ్ అంబాసిడర్ మరొకరు లేరు.’అని జై షా చెప్పారు..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Hitman Rohit ICC Ambassador ICC T20 World Cup 2026 latest news Rohit sharma Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.