📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Rohit Sharma: అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ

Author Icon By Anusha
Updated: January 5, 2026 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Rohit Sharma warns fans

క్రికెట్ ప్రపంచంలో రోహిత్ శర్మ (Rohit Sharma) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైదానంలోనే కాదు, బయట కూడా అభిమానులు అతన్ని చూసేందుకు ఎగబడుతుంటారు. అయితే, రోహిత్ శర్మకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారులో వెళ్తున్న రోహిత్ వద్దకు ఇద్దరు చిన్నారులు వచ్చి సెల్ఫీ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రోహిత్ (Rohit Sharma) కారు కిటికీలోంచి వారికి అభివాదం చేయడానికి చేయి బయట పెట్టగా, వారు ఆయన చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రోహిత్ వారిని హెచ్చరిస్తూ వెంటనే కారు అద్దాలు మూసివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Read also: IPL 2026: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా జడేజా?

అద్భుతంగా 2025 సంవత్సరం

టీమిండియా మాజీ సారథికి 2025 సంవత్సరం అద్భుతంగా సాగింది. భారీగా పరుగులు సాధించడమే కాకుండా పలు రికార్డులను ఆయన బద్దలు కొట్టారు. రోహిత్ సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.ఇక తన కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

సిక్సర్ల రికార్డు: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన తొలి వన్డేలో రోహిత్ తన 352వ సిక్సర్ బాది, పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది (351 సిక్సర్లు) రికార్డును అధిగమించారు. 2015 నుంచి అఫ్రిది పేరిట ఉన్న ఈ రికార్డును ‘హిట్‌మ్యాన్’ తుడిచిపెట్టేశాడు. ప్రస్తుతం 279 వన్డేల్లో రోహిత్ ఖాతాలో 355 సిక్సర్లు ఉన్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Indian Cricket latest news Rohit sharma Telugu News Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.