📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో హిట్ మ్యాన్

Author Icon By Anusha
Updated: November 29, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన కెరీర్‌లోనే ఓ అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన తర్వాత హిట్ మ్యాన్ వన్డే క్రికెట్‌పై దృష్టిసారించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (ICC ODI World Cup) ఆడాలనే సంకల్పంతో బరువు కూడా తగ్గిన హిట్ మ్యాన్ అత్యంత ఎక్కువ వయస్సులో వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అలాంటి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు అత్యంత సమీపంలో ఉన్నాడు.

Read Also:  Ayush Mhatre:రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కేవలం 98 పరుగుల దూరంలో ఉన్నాడు. రేప‌టి నుంచి రాంచీలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ (Rohit Sharma) ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

Rohit Sharma: The hit man is close to a rare record

నాలుగో భారత బ్యాటర్‌గా

రోహిత్ శర్మ (Rohit Sharma) ఇప్పటి వరకు టీ20, టెస్టు, వన్డేల్లో కలుపుకొని 502 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4,301 పరుగులు మాత్రమే చేసిన హిట్ మ్యాన్, టీ20ల్లో 4,231 రన్స్ సాధించాడు. వన్డేల్లో అత్యధికంగా 11,370 పరుగులతో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం వన్డే క్రికెట్‌లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో 98 పరుగులు చేసి 20 వేల మార్క్‌ను అందుకోవాలని చూస్తున్నాడు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

రోహిత్ శర్మ దేశీయ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఎప్పుడు ఆడాడు?

రోహిత్ శర్మ 2005లో ముంబై తరఫున లిస్ట్–ఏ మ్యాచ్ ఆడి దేశీయ స్థాయిలో అరంగేట్రం చేశాడు.

భారత జట్టులోకి రోహిత్ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాడు?

అతను 2007లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత సీనియర్ జట్టులోకి ప్రవేశించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

20000 runs milestone Hitman Rohit Indian Cricket latest news ODI ranking Rohit sharma Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.