టీమిండియా వన్డే జట్టులో ఇటీవల జరిగిన నాయకత్వ మార్పులు పెద్ద చర్చనే రేపాయి. వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ (Rohit Sharma) నుంచి తీసేసి, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్కు అప్పగించడంపై ఎన్నో వాదనలు వినిపించాయి.అయితే, తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు.
Read Also: Abhishek Nair: కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్?
ఈ ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, 2027 ప్రపంచకప్‌లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకునేలా ఆడాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. రోహిత్ ఎంపికపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేశాడు.ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు.
రెండో వన్డేలో క్లిష్ట పరిస్థితుల్లో 73 పరుగులు చేయగా, సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో అజేయమైన 121 పరుగులతో జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును కూడా అందుకున్నాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్
ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్, రోహిత్ ఫిట్‌నెస్‌ను, బ్యాటింగ్‌ను ప్రశంసించాడు.”2027 ప్రపంచకప్ (2027 World Cup) కు రోహిత్ శర్మ కచ్చితంగా ఉండాలి. అతను, విరాట్ కోహ్లీ లేకుండా మనం ప్రపంచకప్ ఆడలేం. రోహిత్ 11 కిలోల బరువు తగ్గి సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఇది మనకు తెలిసిన పాత రోహిత్ శర్మ.
బంతిని ఎంతో సులభంగా, ఆలస్యంగా ఆడుతూ తన క్లాస్ చూపించాడు” అని శ్రీకాంత్ వివరించాడు.రోహిత్ (Rohit Sharma) వయసు 38 ఏళ్లు కావడం, ప్రపంచకప్ నాటికి 40కి చేరువ కానుండటంతో వస్తున్న విమర్శలను శ్రీకాంత్ తిప్పికొట్టాడు. “అతనికి 40 ఏళ్లు వస్తున్నాయని వయసు గురించి మాట్లాడొద్దు. అతను ఫిట్‌గా ఉన్నాడు, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి శ్రీకాంత్ ఓ కీలక సూచన
స్లిప్స్‌లో అద్భుతమైన క్యాచ్‌లు పడుతున్నాడు. ఇంకేం కావాలి? 2019 ప్రపంచకప్‌లో ఆడినంత సులభంగా ఇప్పుడు ఆడుతున్నాడు” అని ఆయన పేర్కొన్నాడు.అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) ఓ కీలక సూచన చేశారు. “నేనే గనుక సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటే, ఈరోజే వాళ్లిద్దరి
(రోహిత్, కోహ్లీ) దగ్గరకు వెళ్లి ‘మీరు 2027 ప్రపంచకప్‌కు ఫిట్‌గా ఉండండి, మాకు ట్రోఫీ గెలిపించండి’ అని చెబుతాను,” అంటూ వారిద్దరిపై తనకున్న నమ్మకాన్ని శ్రీకాంత్ బలంగా వ్యక్తం చేశారు. మూడో వన్డేలో రోహిత్, కోహ్లీ కలిసి అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: