భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “న్యూ రోల్ లోడింగ్.. లీడ్ ఇండియా.. రేపు మధ్యాహ్నం వరకు ఆగండి” అని రాసిన స్టేటస్ అభిమానులను ఉత్కంఠలోకి నెట్టింది. సాధారణంగా రోహిత్ సోషల్ మీడియాలో ఇలా సస్పెన్స్ క్రియేట్ చేసే పోస్టులు చేయడం అరుదు కావడంతో, ఈ అప్‌డేట్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
Read Also: IND Vs NZ: సంజూ శాంసన్ పై సునీల్ గవాస్కర్ అసహనం
రోహిత్ శర్మ పోస్ట్ వెనుక అర్థం ఏంటి?
టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కొందరు అభిమానులు దీనిని వన్డే కెప్టెన్సీ పునఃప్రారంభానికి సంకేతంగా భావిస్తుండగా, మరికొందరు ఇది బ్రాండ్ ప్రమోషన్ లేదా వ్యక్తిగత ప్రాజెక్ట్‌కు సంబంధించినదని అభిప్రాయపడుతున్నారు. పూర్తి స్పష్టత కోసం రేపు మధ్యాహ్నం వరకు వేచిచూడాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: