2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి భారత క్రికెట్ అభిమానులనే కాకుండా, స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ను కూడా కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సమయంలో ఆయన అనుభవించిన వేదన, ఆ తర్వాత సాధించిన విజయాల వెనుక ఉన్న పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకం. 2023 ప్రపంచ కప్ ఓటమి తర్వాత పూర్తిస్థాయిలో రిటైర్ అవ్వాలని తీవ్రంగా ఆలోచించినట్లు టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma)వెల్లడించారు. “ఇక నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు” అనే భావనతో ఉన్నానని ఆయన తెలిపారు.
Smriti Mandhana:రికార్డు సృష్టించిన స్మృతి
ఇకపై ఆడకూడదనుకున్నాను
“2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత నేను పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. అందరూ చాలా నిరాశ చెందారు. ఏమి జరిగిందో మేము నమ్మలేకపోయాము. ఇది నాకు వ్యక్తిగతంగా చాలా కష్టమైన సమయం. ఎందుకంటే నేను ఆ ప్రపంచ కప్ కోసం రెండు లేదా మూడు నెలల ముందు నుంచి కాదు ఏకంగా 2022లో నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాను.
కానీ, టోర్నీ ఆసాంతం బాగా ఆడి, ఫైనల్లో ఊహించని ఓటమి నన్ను కుంగదీసింది. దాంతో ఈ క్రీడ నా నుంచి ప్రతిదీ తీసివేసిందనే భావన కలిగింది. దాంతో నేను ఇకపై ఆడకూడదనుకున్నాను. ఈ భావన నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టింది. నెమ్మదిగా నేను తిరిగి నా మార్గాన్ని, శక్తిని తిరిగి పొందాను. మైదానంలో మళ్లీ దిగాను” అని రోహిత్ మాస్టర్స్ యూనియన్ ఈవెంట్ సందర్భంగా అన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: