ఇండోర్‌లోని మూడో వన్డే జరిగిన తర్వాత హోటల్ వద్ద రోహిత్ శర్మ(Rohit Sharma) వెళుతున్న రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ దూసుకెళ్లింది. భద్రతా సిబ్బందిని తప్పించుకుని రోహిత్ చేయి పట్టుకుని లాగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అడ్డుకున్నారు అయితే, ఆ మహిళ అసలు విషయాన్ని వెల్లడించింది. ఆమె సెల్ఫీ కోసం రాలేదని, ప్రాణాపాయంలో ఉన్న తన కూతురును రక్షించుకోవడానికి సాయం కోరడానికి మాత్రమే రోహిత్ వద్దకు వచ్చిందని తెలిపారు. భద్రతా సిబ్బందికి క్షమాపణలు తెలిపారు.
Read Also: IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం
కూతురి పరిస్థితి కోసం ఆర్థిక సాయం అడిగేందుకు వెళ్లినట్లు వివరణ
తన పేరు సరితా శర్మ అని తన కూతురు అనిక శర్మ అరుదైన వ్యాధితో బాధపడుతోందని ఆ వీడియోలో చెప్పారు. తన కూతురును కాపాడుకోవాలంటే రూ.9 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని వైద్యులు చెప్పారన్నారు. దీంతో తాము డొనేషన్లు సేకరించి రూ.4 కోట్ల 10 లక్షలు సేకరించామని, మిగతా డబ్బు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఎక్కువ సమయం లేదని వైద్యులు చెప్పడంతో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీలను(Virat Kohli) సాయం అడిగేందుకు హోటల్ వద్దకు వెళ్లానని సరిత తెలిపారు.
రోహిత్ సర్ నేను సెల్ఫీ కోసం అలా చేయలేదు. నా కూతురి పరిస్థితి చెప్పి సాయం కోరడానికే మీ వద్దకు వచ్చా. భావోద్వేగంలో చేయి పట్టుకుని లాగాను. దీనికి మీకు, అధికారులకు క్షమాపణ చెబుతున్నా. కానీ, నాకు సాయం చేయండి. విరాట్ సర్, రోహిత్ సర్ మీరు సాయం చేస్తే నా కూతురు నాకు దక్కుతుంది అంటూ సరితా శర్మ ఈ వీడియో ద్వారా క్రికెటర్ల సాయం అర్థించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: