📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rohan Boppanna: టెన్నిస్‌కు రోహ‌న్ బొప్ప‌న్న‌ గుడ్ బై

Author Icon By Anusha
Updated: November 1, 2025 • 9:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత టెన్నిస్‌లో అజరామరమైన అధ్యాయాన్ని రాసిన రోహన్ బోపన్న (Rohan Boppanna) తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు. శనివారం (నేడు) సోషల్ మీడియా ద్వారా ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు రెండు ద‌శాబ్ధాల పాటు అత‌ను టెన్నిస్ కెరీర్‌ను కొన‌సాగించాడు. 45 ఏళ్ల ఉన్న బొప్ప‌న్న చివ‌రి సారి పారిస్ మాస్ట‌ర్స్ ఆడాడు. ఆ టోర్నీలో క‌జ‌క్ ప్లేయ‌ర్‌తో జోడి క‌ట్టాడు. కానీ ఓపెనింగ్ రౌండ్‌లోనే ఆ జంట ఇంటిబాట‌ప‌ట్టింది.

Read Also: Arun Dhumal: రోహిత్- కోహ్లీ పై IPL ఛైర్మన్ ప్రశంసలు

పారిస్ మాస్టర్స్-1000 టోర్నమెంట్‌లో ఆడిన కొద్ది రోజులకే బోపన్న (Rohan Boppanna) ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారత టెన్నిస్ (Tennis) చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా పేరుగాంచిన 45 ఏళ్ల బోపన్న, తన కెరీర్‌లో ఎన్నో శిఖరాలను అధిరోహించాడు. ముఖ్యంగా, 43 ఏళ్ల వయసులో 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచి, ప్రపంచ నెం.1 ర్యాంకును అందుకొని చరిత్ర సృష్టించాడు.

అంతకుముందు 2017లో గబ్రియేలా డబ్రోస్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నాడు.తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. “జీవితానికి అర్థాన్నిచ్చిన దానికి ఎలా వీడ్కోలు చెప్పాలి? 20 ఏళ్ల మరపురాని ప్రయాణం తర్వాత, నేను అధికారికంగా నా రాకెట్‌కు విశ్రాంతినిస్తున్నాను” అని బోపన్న తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

Rohan Boppanna

టెన్నిస్‌తో తన బంధం ముగియలేదని స్పష్టం చేశాడు

తన ప్రయాణం కూర్గ్ అనే చిన్న పట్టణంలో మొదలైందని, పగుళ్లిచ్చిన కోర్టుల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడే స్థాయికి ఎదగడం ఒక కలలా ఉందని గుర్తు చేసుకున్నాడు.ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరి, భార్య సుప్రియ, కుమార్తె త్రిధ, కోచ్‌లు, అభిమానులు, దేశానికి కృతజ్ఞతలు తెలిపాడు.

“భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. త్రివర్ణ పతాకం పేరుతో బరిలోకి దిగిన ప్రతిసారీ ఆ గర్వాన్ని, బాధ్యతను మోశాను” అని బోపన్న ఉద్ఘాటించాడు. తన కెరీర్‌లో మొత్తం ఐదు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరిన బోపన్న,

డేవిస్ కప్, ఒలింపిక్స్‌లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.తాను పోటీల నుంచి తప్పుకుంటున్నప్పటికీ, టెన్నిస్‌తో తన బంధం ముగియలేదని స్పష్టం చేశాడు. “చిన్న పట్టణాల నుంచి వచ్చే యువ క్రీడాకారులలో స్ఫూర్తి నింపాలనుకుంటున్నాను. ఇది వీడ్కోలు కాదు, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని బోపన్న తన పోస్ట్‌ను ముగించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News indian tennis legend latest news rohan bopanna retirement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.