📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Roger Binny: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ అవుట్

Author Icon By Sharanya
Updated: June 2, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) లో కీలక నాయకత్వ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binney) వయోపరిమితిని చేరుకోనుండటంతో, ఆయన పదవికి గుడ్‌బై చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

వయోపరిమితి కారణంగా రోజర్ బిన్నీ పదవీ విరమణ

ప్రస్తుత అధ్యక్షుడు, 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ వయోపరిమితి కారణంగా త్వరలో పదవి నుంచి వైదొలగనుండగా, ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు. రోజర్ బిన్నీ ఈ ఏడాది జులై 19న తన 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీంతో నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవిలో కొనసాగే అర్హతను కోల్పోతారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని తెలిసింది.

తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు

రాజీవ్ శుక్లా, ప్రస్తుతం బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితులలో తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసే అధికారాన్ని కలిగి ఉండటం వల్ల, బిన్నీ పదవీ విరమణ అనంతరం ఆయన తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది సుమారు మూడు నెలల వ్యవధిలో కొనసాగనుంది.

రోజర్ బిన్నీ – క్రికెట్ నుండి అధ్యక్ష పదవి వరకు

రోజర్ బిన్నీ పేరుతో భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. రోజర్ బిన్నీ 2022లో సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ దిగ్గజ సీమర్ 27 టెస్టులు, 72 వన్డే మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో మొత్తం 124 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 1983లో భారత్ చరిత్రాత్మక ప్రపంచకప్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి భారత విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.

Read also: Rinku Singh: ఈ నెల 8న ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం

Hardik Pandya: శ్రేయస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడన్న పాండ్య

#BCCI #BCCI2025 #BCCIChief #BinnyResigns #IndianCricket #RogerBinny #RogerBinnyStepsDown Breaking News in Telugu google news telugu India News in Telugu Latest Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.