భారత క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాబిన్ ఊతప్ప (Robin Uthappa), ఇప్పుడు తన స్పష్టమైన అభిప్రాయాలతో మరోసారి దృష్టిని ఆకర్షించాడు. రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన మాజీ క్రికెటర్, ఈ మెగా లీగ్‌లో భారీ మార్పులు తీసుకురావాలని సూచించాడు. ఆటగాళ్ల వేలం విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో డ్రాఫ్ట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డాడు.
Read Also: Team India: టీమిండియా తాత్కాలిక కొత్త కెప్టెన్..! ఎవరంటే?
వేలం వ్యవస్థ రద్దు… డ్రాఫ్ట్ పద్ధతి ప్రవేశపెట్టాలి
అలాగే రెండున్నర నెలల టోర్నీని ఆరు నెలల లీగ్‌గా విస్తరించాలని, ఏడాది పొడవునా ప్లేయర్ల ట్రేడింగ్ విండోను తెరిచి ఉంచాలని తన యూట్యూబ్ ఛానెల్ (YouTube channel) లో పేర్కొన్నాడు. “ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. కానీ ఇప్పటికీ అది స్టార్టప్ దశను దాటడం లేదు. ఇకనైనా పరిణతితో వ్యవహరించాలి.
దయచేసి వేలాన్ని రద్దు చేయండి. నేను ఆడుతున్న రోజుల నుంచే ఈ మాట చెబుతున్నాను” అని ఊతప్ప (Robin Uthappa) వ్యాఖ్యానించాడు. కేవలం టీవీ వినోదం అనే ఆలోచన నుంచి బయటకు రావాలని సూచించాడు. డ్రాఫ్ట్ విధానం కూడా టీవీలో ఆసక్తికరంగా ఉంటుందని, అభిమానుల్లో జట్టు పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని వివరించాడు.
“ఐపీఎల్‌ను ఆరు నెలల లీగ్‌గా మార్చాలి. మధ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా నిర్వహించుకోవచ్చు. కాలానికి అనుగుణంగా లీగ్ మారాలి” అని ఊతప్ప అన్నాడు. డిసెంబర్ 16న అబుదాబిలో ఐపీఎల్ (IPL) వేలం జరగనున్న నేపథ్యంలో ఊతప్ప వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: