📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Rob Walter: టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

Author Icon By Pooja
Updated: March 8, 2026 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rob Walter: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) తుది సమరానికి సర్వం సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కివీస్ ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సొంత గడ్డపై ఆడుతున్న టీమిండియానే ఈ పోరులో హాట్ ఫేవరెట్ అని ఆయన అంగీకరించారు. అయితే, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టించడం తమ జట్టుకు అలవాటేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also:T20 WC Final: ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

Rob Walter: Team India is the favorite.. but! There is no guarantee that they will win the trophy

మీడియాతో మాట్లాడిన వాల్టర్, భారత్‌తో పోలిస్తే తమ దగ్గర వనరులు, ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉండవచ్చని.. దాదాపు అన్ని విభాగాల్లోనూ భారత్ బలంగా ఉందని విశ్లేషించారు. కానీ, మైదానంలోకి దిగాక ప్రణాళికలను సమష్టిగా అమలు చేయడమే తమ అసలు బలమని పేర్కొన్నారు. ఈ టోర్నీ పొడవునా వేర్వేరు మ్యాచ్‌ల్లో వేర్వేరు ఆటగాళ్లు బాధ్యత తీసుకుని జట్టును ఫైనల్ వరకు చేర్చారని గుర్తు చేశారు. కేవలం ఫేవరెట్ అన్న ముద్ర ఉన్నంత మాత్రాన కప్పు సొంతం కాదని, ఫైనల్ ఒత్తిడిలో ఏమైనా జరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

దక్షిణాఫ్రికాపై సాధించిన 9 వికెట్ల భారీ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని వాల్టర్ తెలిపారు. అలాగే కివీస్ సారథి మిచెల్ శాంట్నర్ నాయకత్వ పటిమపై ఆయన ప్రశంసలు కురిపించారు. శాంట్నర్ అత్యంత ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపిస్తారని, క్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు జట్టుకు శ్రీరామరక్ష అని కొనియాడారు. శాంట్నర్ విలువను కొందరు తక్కువ అంచనా వేసినా, జట్టులోని ప్రతి ఆటగాడు అతడిని గౌరవిస్తారని.. నేటి ఫైనల్లో అతడి కెప్టెన్సీ కివీస్‌కు కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.