ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా (Ro-Ko) చాటారు. బ్యాటింగ్ విభాగంలో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI rankings) లో రోహిత్ శర్మ 781 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో నిలవగా.. విరాట్ కోహ్లీ 773 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత కెరీర్‌లో తొలిసారి అగ్రస్థానం అందుకున్న రోహిత్ శర్మ.. అదే స్థానంలో కొనసాగుతున్నాడు.
Read Also: T20 2026: JioHotstar వైదొలగడానికి కారణాలు ఇవేనా..?
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ (Ro-Ko) రెండు స్థానాలు ఎగబాకి టాప్-2 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. డారిల్ మిచెల్, ఇబ్రహీం జడ్రాన్, శుభ్‌మన్ గిల్ టాప్-5లో కొనసాగుతున్నారు. గాయంతో భారత జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ 10వ స్థానానికి పడిపోయాడు.
కేఎల్ రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రెండు స్థానాలు దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా రెండు స్థానాలు దిగజారి 16వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి అక్షర్ పటేల్ ఒక్కడే 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.
హార్దిక్ పాండ్యా నాలుగో స్థానం
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 6వ స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 10వ స్థానానికి పడిపోయాడు. టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానం చేరాడు.టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, రోహిత్..
కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజా ప్రదర్శనతో ఈ ఇద్దరి ఆటగాళ్లకు సర్వత్రా మద్దతు లభిస్తుంది. వారితో పెట్టుకుంటే నాశనం అవుతారని రవి శాస్త్రి హెచ్చరించగా.. వారి కంటే మెరుగ్గా ఆడే ఆటగాళ్లు ఎవరో చెప్పాలని హర్భజన్ సింగ్ నిలదీసాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: