ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027లో టీమిండియా క్రికెటర్ లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (RO-KO) ఆడతారా? అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వయసు కంటే ఫిట్‌నెస్, ఫామ్ ముఖ్యమని ధోనీ స్పష్టం చేశాడు. ఆటగాడు శారీరకంగా ఫిట్‌గా ఉండి, మంచి ఫామ్‌లో ఉంటే వయసుతో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.వయసు కేవలం సంఖ్య మాత్రమేనని,
Read Also: Ravichandran Ashwin: పాకిస్థాన్‌పై అశ్విన్ ఆగ్రహం
20-25 మ్యాచ్‌లు ఆడితే అనుభవం
35 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల కుర్రాడి కంటే ఫిట్‌గా ఉంటే అతనే జట్టుకు అర్హుడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఫిట్‌గా ఉండి, ఫామ్‌లో ఉంటే వన్డే ప్రపంచకప్ 2027 ఆడుతారని బదులిచ్చాడు. వయసును కాకుండా ఫామ్, ఫిట్‌నెస్‌ను పరిగణలోకి తీసుకోవాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు పరోక్షంగా చురకలంటించాడు.“అనుభవం ఒక్క రోజులో రాదు.
16-17 ఏళ్ల వయస్సులో ఆడటం మొదలుపెట్టినవారికే అసలైన అనుభవం వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ చాలా కఠినమైనది. 20-25 మ్యాచ్‌లు ఆడితే అనుభవం వచ్చినట్టు కాదు” అని ధోనీ తెలిపాడు. తాను కూడా 39 ఏళ్ల వయసు వరకు భారత జట్టుకు ఆడిన విషయాన్ని గుర్తు చేసిన ధోనీ, అనుభవజ్ఞులపై నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: