📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Rishabh Pant: రిషబ్ పంత్ ఆటతీరుపై చాపెల్ ప్రశంసలు

Author Icon By Sharanya
Updated: June 26, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లాండ్‌ (England) తో హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో రిషబ్ పంత్ (Rishabh Pant) అసాధారణమైన ఆటతీరు ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు నమోదు చేసిన పంత్, టెస్టు క్రికెట్‌లో రెండుసార్లు సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా చరిత్రలోకి ఎక్కాడు. అంతేకాకుండా, టెస్టుల్లో భారత తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీని అధిగమించాడు.

పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు

పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే టెస్టు క్రికెట్‌లో భారత వికెట్ కీపర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీని అధిగమించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై గ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ, పంత్ బ్యాటింగ్ కళకు కొత్త నిర్వచనం ఇస్తున్నాడని పేర్కొన్నాడు.

“ఆటను పునర్నిర్వచిస్తున్నాడు” – గ్రెగ్ చాపెల్

రిషబ్ పంత్ ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ తన బ్యాటింగ్‌తో క్రికెట్ ఆటకు కొత్తదనాన్ని అద్దుతున్నాడని, ఆటను పునర్నిర్వచిస్తున్నాడని చాపెల్ కొనియాడాడు. రిషబ్ అందం ఏంటంటే, అతను చాలా వేగంగా పరుగులు చేస్తాడు. అతని ప్రదర్శన అసాధారణమైంది. అతను ఆడిన కొన్ని షాట్లు ఎంసీసీ క్రికెట్ నియమావళిలో ఉండవు. ఒక బ్యాట్స్‌మన్‌గా అతను నిజంగా ఆటకు కొత్త రూపునిస్తున్నాడు. ఆధునిక టెక్నాలజీతో బ్యాట్లు కూడా చాలా మారాయి. పాత బ్యాట్లతో సాధ్యంకాని షాట్లను ఇప్పుడు ఆడగలుగుతున్నారు. అతని ఆట చూడటానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది” అని వివరించాడు.

ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కి సమానంగా

పంత్ తనకు దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను గుర్తుకు తెస్తాడని, అతని ఆటను అంచనా వేయడం కష్టమని చాపెల్ తెలిపాడు. “నేను అతడిని మొదటిసారి చూసినప్పుడు, నాకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ గుర్తొచ్చాడు. ఇద్దరూ భిన్నమైన ఆటగాళ్లు. కానీ ఒక వికెట్ కీపర్ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసి, వేగంగా పరుగులు చేయగలిగితే జట్టుకు ఎంత తేడా వస్తుందో చూడొచ్చు.

పంత్ ఆటలో ఉన్న ప్రత్యేకత

మొదటి బంతి నుంచే అతని నుంచి ఏం ఆశించాలో మీకు ఎప్పటికీ తెలియదు. ఏ దశలోనైనా అతను ఫాస్ట్ బౌలర్లపైకి దూసుకెళ్లొచ్చు లేదా ఫాలింగ్ ర్యాంప్ షాట్ ఆడొచ్చు. అతని ఆటను ఎప్పుడూ అంచనా వేయలేం. ఇది ప్రత్యర్థి జట్టును ఎప్పుడూ ఒత్తిడిలో ఉంచుతుంది. అతను ఒక మ్యాచ్ విన్నర్. ఆ మ్యాచ్‌లో కూడా దాదాపు తేడా చూపించాడు” అని చాపెల్ ప్రశంసల జ‌ల్లు కురిపించాడు.

Read also: Surya : టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకు సర్జరీ

#GregChappell #INDvsENG #PantCentury #RishabhPant #TeamIndia #TestCricket Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.