📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rishabh Pant: క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన పంత్

Author Icon By Aanusha
Updated: November 27, 2025 • 9:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై తాత్కాలిక సారథి, వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) స్పందించాడు. తాము మంచి క్రికెట్ ఆడలేదని అంగీకరిస్తూ, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాడు. కచ్చితంగా పుంజుకుని, మరింత బలంగా తిరిగివస్తామని హామీ ఇచ్చాడు.

Read Also: Sricharani: వేలంతో వెలుగులోకి వచ్చిన యువ బౌలర్

గౌహతి వేదికగా బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ గెలుపొందింది. వరుసగా రెండో ఏడాది టెస్ట్ సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది.

దాంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో దూరమవడంతో వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ జట్టును నడిపించాడు. కానీ 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే ఏన్నడు లేని పరాజయాన్ని టీమిండియా చవిచూసింది.

View this post on Instagram

A post shared by Rishabh Pant (@rishabpant)

మమ్మల్ని క్షమించండి

పంత్ (Rishabh Pant) ఇన్స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. “గత రెండు వారాలుగా మేం సరైన ప్రదర్శన చేయలేదన్నది వాస్తవం. ఒక జట్టుగా, ఆటగాళ్లుగా మేం ఎప్పుడూ అత్యుత్తమంగా రాణించి కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనుకుంటాం. ఈసారి మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి.

క్రీడలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మేం కష్టపడి, లోపాలను సరిదిద్దుకుని బలంగా పుంజుకుంటాం. మీ మద్దతుకు ధన్యవాదాలు” అని పంత్ పేర్కొన్నాడు.రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా గౌహతిలో జరిగిన రెండో టెస్టుకు దూరం కావడంతో, పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.

ఈ ఫలితం తీవ్ర నిరాశపరిచింది

అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 2000 తర్వాత భారత గడ్డపై సౌతాఫ్రికాకు ఇది రెండో టెస్ట్ సిరీస్ విజయం. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ, “ఈ ఫలితం తీవ్ర నిరాశపరిచింది. ప్రత్యర్థి జట్టు సిరీస్‌ను పూర్తిగా శాసించింది. ఒక జట్టుగా మేం అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అదే మా ఓటమికి కారణమైంది” అని ఓటమికి గల కారణాలను వివరించాడు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

India vs South Africa Test series latest news Rishabh Pant reaction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.