📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

RCB : ఒక్కొక్కరికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వనున్న ఆర్సీబీ

Author Icon By Hema
Updated: August 30, 2025 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్జీబీ విజయోత్సవాల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర
విమర్శల్ని ఎదుర్కొంది. ప్రభుత్వం, నిర్వహాకులు సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని విమర్శించారు. కర్ణాటక (Karnataka) ప్రభుత్వంపై కూడా పలు
విమర్శలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన ఆరాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వహాకులపై
కఠిన చర్యలు తీసుకున్నారు.

ఒక్కొక్కరికి రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా

బాధిత కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటామని హామీ (guarantee) ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. తొక్కిసలాటలో
పాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.

ఆరోజు ఏం జరిగింది?

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించిన ఆర్సీబీ.. పదేహేడేళ్ల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. దీంతో బెంగళూరు అభిమానుల సంబరాలు
ఆకాశాన్ని అంటాయి. అంతేకాక ఆర్సీబీ ఫ్రాంచైజీ సైతం ఈ గెలుపుపై ఘనంగా వేడుకలు చేసుకోవాలని భావించింది. దీంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో
విజయోత్సవ వేడుకలను నిర్వహించాలని ఆర్సీబీ ప్రణాళిక వేసింది. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో తీరని విషాదం నెలకొంది. భారీ సంఖ్యలో అభిమానులు
తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. చాలినంత పోలీసులు, భద్రతాపరమైన లోపాల వల్ల స్టేడియంలో ఊహించిన దానికంటే అధికసంఖ్యలో అభిమానులు వచ్చారు. దీంతో
ప్రజల్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఫ్రీ టికెట్లు ఇస్తున్నారనే వదంతితో ఒక్కసారిగా అక్కడికి చేరుకునేందుకు అభిమానులు ప్రయత్నించడంతో తొక్కిసలాట
జరిగింది. ఈ ఘటనలో స్పాట్లోనే 11మంది మరణించగా, యాభైమందికి పైగా గాయపడ్డారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఆగ్రహం
వ్యక్తం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

RCB : ఒక్కొక్కరికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వనున్న ఆర్సీబీ

తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆర్సీబీ టీమ్

ఈ దుర్ఘటనతో మా హృదయాలు ముక్కలయ్యాయి. ఆ రోజు ఆర్సీబీ కుటుంబంలోని పదకొండు మంది సభ్యులను మేం కోల్పోయామని, వారు లేని లోటు పూడ్చలేనిదని టీమ్
ప్రకటించింది.

RCB CARES అంటే ఏమిటి?

RCB CARES అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రారంభించిన ఒక కార్యక్రమం, ఇది సంఘటనల సమయంలో బాధితులకు ఆర్థిక సహాయం, మానసిక మద్దతు, మరియు నిరంతర సహాయం అందించడానికి లక్ష్యంగా ఉంది.

ఎక్స్ గ్రేషియో మొత్తాన్ని ఎలా పొందాలి?

ప్రస్తుతం, ఈ ఎక్స్ గ్రేషియో మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ప్రత్యక్షంగా అందజేసే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలు సంబంధిత అధికారులతో సంప్రదించడానికి సూచించబడతాయి.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-bank-holiday-august-banks-open-or-closed/business/538306/

Breaking News in Telugu ExGratia IPL2025 Latest News in Telugu PlayerBonus RCB RoyalChallengersBangalore TeamRCB Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.