Yash Dayal Missing RCB Camp: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు గట్టి షాక్ తగిలింది. జట్టు కీలక పేసర్ యశ్ దయాల్ (Yash Dayal) చుట్టూ ముసురుకున్న వివాదాలు, కేసులు ఇప్పుడు ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి.
Read Also: Laxman Sivaramakrishnan Resigns BCCI Commentator : కామెంటరీకి శివరామకృష్ణన్ రాజీనామా!
Yash Dayal Missing RCB Camp: అసలేం జరిగింది? (Key Highlights)
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ శిక్షణా శిబిరం ప్రారంభమైనప్పటికీ, యశ్ దయాల్ అక్కడ కనిపించలేదు.ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారింది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అతను కనిపించకపోవడంతో అభిమానులు, విశ్లేషకుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ విజయంలో భాగమైన యశ్ దయాల్, ఈసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. అతనిపై రెండు వేర్వేరు రాష్ట్రాల్లో నమోదైన కేసులు, అందులో ఒకటి మైనర్‌కు సంబంధించినదిగా ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఈ కేసులు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీశాయి.
ఐపీఎల్ కోసం రూపొందించిన ఆర్‌సీబీ టీమ్ బస్సు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దయాల్ మినహా దాదాపు అందరు ఆటగాళ్ల ఫొటోలు ఈ బస్సుపై ముద్రించి ఉన్నాయి. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని జట్టు నుండి ఉద్వాసన పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో ప్రాక్టీస్ సెషన్ కు అతను దూరం కావడంతో ఈ ఊహాగానాలు చెలరేగాయి.
అతనిపై ఉన్న చట్టపరమైన సమస్యల కారణంగా ఫ్రాంఛైజీ అతన్ని జట్టు నుండి తొలగించిందని అభిమానులు చెబుతున్నారు. ఆర్‌సీబీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతను ఎదుర్కొంటోన్న ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ఒక కేసులో అతని ముందస్తు బెయిల్‌ను దిగువ కోర్టు తిరస్కరించినప్పటికీ, రాజస్థాన్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కేసు న్యాయ ప్రక్రియలో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: