📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025 : హైదరాబాద్ లో అంబరాన్ని తాకిన RCB ఫ్యాన్స్ సంబరాలు

Author Icon By Sudheer
Updated: June 4, 2025 • 9:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఐపీఎల్ 2025 విజేత(IPL Won)గా నిలవడంతో దేశవ్యాప్తంగా RCB అభిమానులు హర్షాతిరేకంతో మునిగిపోయారు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో పంజాబ్‌పై 6 పరుగుల తేడాతో గెలవడం ద్వారా వారు చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం తర్వాత బెంగళూరు నగరంతో పాటు హైదరాబాద్ నగరంలోనూ అభిమానులు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. “ఈ సాలా కప్ నమ్దే” అంటూ నినాదాలు హోరెత్తించాయి.

హైదరాబాద్ లో ఫ్యాన్స్ సంబరాలు

కూకట్‌పల్లి, సూరారం, ట్యాంక్‌బండ్ వంటి ప్రాంతాల్లో ఆర్సీబీ అభిమానులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున రచ్చ చేశారు. హాస్టళ్లలోని విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ సందడి చేశారు. కొంతమంది యువకులు బస్సులు, లారీలపై ఎక్కి విరాట్ కోహ్లీ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. అయితే ఇది ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారు. ఎక్కడికక్కడ ఆర్సీబీ జెర్సీలు ధరించి జట్టు గెలుపును ఘనంగా జరుపుకున్నారు.

ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ.. ఈ సాలా కప్ నమ్దే

ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ ప్రాంతాల్లోనూ అభిమానుల ఉత్సాహం గగనాన్నంటింది. టపాసులతో రహదారులు వెలుగులు మిగిలాయి. “ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ.. ఈ సాలా కప్ నమ్దే” అంటూ నినాదాలు నినదించాయి. హైదరాబాద్‌ సన్‌రైజర్స్ జట్టు హోం నగరంగా ఉన్నా, ఆర్సీబీకి ఇక్కడ గట్టి ఫ్యాన్ బేస్ ఉన్నట్టు స్పష్టమైంది. అయితే కొంతమంది అభిమానులు మరింత ఉత్సాహంతో హద్దులు దాటిపోవడంతో కొన్ని ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద, హైదరాబాద్ RCB విజయాన్ని గ్రాండ్‌గా జరుపుకుంది.

Read Also : Gandhi Bhavan : గాంధీ భవన్ కు భద్రత పెంపు.. కారణమా అదేనా ?

Google News in Telugu hyderabad IPL 2025 CUP rcb fans celebrations RCB Won

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.