📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Yash Dayal: ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌పై కేసు న‌మోదు

Author Icon By Sharanya
Updated: July 8, 2025 • 1:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న పేసర్ యశ్ దయాల్ (Yash Dayal) పై ఘజియాబాద్ కు చెందిన ఓ యువతి లైంగిక వేధింపుల ఆరోపణలతో (woman accused of sexual harassment) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను గత ఐదేళ్లుగా యశ్‌తో రిలేషన్షిప్‌లో ఉన్నానని పేర్కొన్న ఆమె, అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ ఆరోపించారు.

అధికారిక ఫిర్యాదు వివరాలు

జూన్ 21న ముఖ్యమంత్రి ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా బాధితురాలు మొదట ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన ఇందిరాపురం పోలీసులు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద యశ్ దయాల్‌ (Yash Dayal) పై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

బాధితురాలి ఆరోపణలు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు (victim is from Ghaziabad), తాను యశ్ దయాల్‌తో గత ఐదేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో యశ్ దయాల్ తనను పెళ్లి చేసుకుంటానని పదేపదే నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు. తనను అతని కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని, వారంతా తననే కోడలిగా చేసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

యశ్ దయాల్ ప్రవర్తన వల్ల తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానని, మానసిక వేదన తట్టుకోలేక చాలాసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. యశ్‌కు ఇతర యువతులతో కూడా సంబంధాలున్నాయని, ఇది తనను మానసికంగా కుంగదీసిందని ఆమె ఆరోపించారు.

పోలీసుల విచారణ

ప్రస్తుతం పోలీసులు కేసును గంభీరంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఆరోపణలను నిజానిజాల ప్రాతిపదికన పరిశీలించేందుకు ఆధారాలు, కాల్ రికార్డులు, మెసేజ్‌లు, ఫోటోలు వంటి డిజిటల్ ఆధారాలు సేకరిస్తున్నారు.

యశ్ దయాల్ కుటుంబ ప్రతిస్పందన

అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన యశ్ దయాల్ తండ్రి, ఆ యువతి ఎవరో తమకు తెలియదని చెప్పినట్లు సమాచారం .

యశ్ దయాళ్ స్పిన్నర్?

యష్ దయాల్ (జననం 13 డిసెంబర్ 1997) ఒక భారతీయ క్రికెటర్, అతను దేశీయ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్‌కు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అతను ఎడమచేతి వాటం ఫాస్ట్-మీడియం బౌలర్ .

యశ్ దయాల్ ఎందుకు ప్రసిద్ధి చెందారు?

2023 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆడుతున్న రోజుల్లో రింకు సింగ్ చేతిలో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టడంతో యష్ దయాల్ వెలుగులోకి వచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: India vs England: భారీ ఓటమి తర్వాత ఇంగ్లండ్ కీలక నిర్ణయం

BNS Section 69 Breaking News Ghaziabad news latest news RCB Telugu News Yash Dayal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.