📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

Latest News: RCB: అంబానీకి పోటీగా ఐపీఎల్‌లో అదానీ ఎంట్రీ?

Author Icon By Aanusha
Updated: November 6, 2025 • 8:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). ఈ జట్టుకు కోట్లాది అభిమానులు ఉన్నారు. ప్రతి సీజన్‌లోనూ ఆర్సీబీ ట్రోఫీ కోసం పోరాడుతూనే వచ్చింది. చివరకు 2025 సీజన్‌లో ఆ కల నెరవేరింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో కాకపోయినా, ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. కానీ ఆ విజయం తర్వాత తొలి ఏడాదే ఆ ఫ్రాంఛైజీకి చేదు అనుభవం మిగిలింది.

Read Also:  Shami: షమీకు మరో షాక్!

తాజాగా ఫ్రాంఛైజీ మొత్తాన్ని అమ్మేస్తున్నారన్న వార్తలు కన్ఫార్మ్ కావడంతో అభిమానులు మరింత దిగాలు పడుతున్నారు. ఆర్సీబీ యాజమాన్యం అయిన డయాజియో సంస్థ ఇప్పటికే విక్రయ ప్రక్రియ మొదలుపెట్టడంతో.. కొత్త యాజమాన్యం ఎవరు అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఫ్రాంఛైజీలలో ఆర్సీబీ (RCB) ప్రధాన స్థానంలో ఉంది.

ఈ టీమ్ నుంచి మార్కెటింగ్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి (Virat Kohli) బ్రాండ్ వ్యాల్యూతో పాటు ఆ జట్టు బ్రాండ్ వ్యాల్యూ కూడా చాలా ఎక్కువే. ఫ్యాన్ బేస్‌లో కూడా ఆర్సీబీ రికార్డులు సృష్టించడంతో ఇప్పుడు ఆ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి.

RCB

గొప్ప ధనవంతుల్లో టాప్ ప్లేస్‌లో

అందులో ముఖ్యంగా అదానీ కంపెనీ (Adani Company) ఉండటం విశేషం.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు కోసం ముఖ్యంగా ఐదు ప్రధాన కంపెనీలు పోటీపడుతున్నాయి. అమెరికాలో ఉన్న ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, భారతదేశం గొప్ప ధనవంతుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న అదానీ గ్రూప్, ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) లో భాగస్వాములు అయిన జిందాల్ గ్రూప్, అదర్ పూనావాలా, రవి జైపూరియా వంటి ప్రముఖ వ్యాపారవేత్తల కన్ను ఇప్పుడు ఆర్సీబీపై పడింది.

ప్లేయర్ల కొనుగోలు నుంచి సీజన్ ముగిసే వరకూ ఐపీఎల్ అంటేనే భారీ బిజినెస్. గెలుపోటములు పక్కన పెడితే భారత్‌లో ఐపీఎల్ (IPL) మీద జరిగిన వ్యాపారం ఇంకెక్కడా రాదు. టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టయినా, అట్టడుగున ఉన్న టీమ్ అయినా బిజినెస్‌లో ఏ మాత్రం తగ్గవు.

బిజినెస్‌ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపార సంస్థలు

ముఖ్యంగా వ్యాపార ప్రకటనలు, కమర్షియల్ యాడ్స్ ఇలా ఎన్నో వందల కోట్ల వ్యాపారం ఐపీఎల్ నుంచి వస్తుంది.ఈ బిజినెస్‌ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఒకవేళ ఆర్సీబీని అదానీ గ్రూప్ సొంతం చేసుకుంటే.. బిజినెస్‌లో మాదిరిగానే ఐపీఎల్‌లోనూ అంబానీతో పోటీపడే అవకాశాలు ఉన్నాయి.

అంబానీ గ్రూప్ చేతిలో ఉన్న ముంబై ఇండియన్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ప్లేయర్ల కోసం ఎంతయినా ఖర్చు పెట్టే అంబానీకి పోటీగా అదానీ కూడా భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aadani FranchiseSale IPL2026 latest news RoyalChallengersBangalore Telugu News ViratKohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.