📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

రిటైర్మెంట్ పై స్పందించిన రవీంద్ర జడేజా

Author Icon By Divya Vani M
Updated: March 10, 2025 • 9:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రిటైర్మెంట్ పై స్పందించిన రవీంద్ర జడేజా ఇటీవల రవీంద్ర జడేజా రిటైర్మెంట్ గురించి అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే జడేజా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారని ప్రచారం జరిగింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ సమయంలో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. జడేజా తన ఓవర్ల కోటాను పూర్తి చేసిన వెంటనే విరాట్ కోహ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ ఘటనతో జడేజా వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.అయితే, ఈ రూమర్స్‌పై స్వయంగా జడేజా స్పందించారు. “నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయవద్దు.ధన్యవాదాలు” అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

రిటైర్మెంట్ పై స్పందించిన రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు

దీంతో తాను వన్డే ఫార్మాట్‌లో ఇంకా కొనసాగుతానని పరోక్షంగా తెలియజేశారు.గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఈ ముగ్గురు ఆటగాళ్లు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ శర్మ ఇప్పటికే ఈ వార్తలను ఖండించారు. ఇప్పుడు జడేజా కూడా స్పందించడంతో, వీరి రిటైర్మెంట్‌పై వస్తున్న వదంతులకు తెరపడిందని చెప్పొచ్చు.అయితే, రవీంద్ర జడేజా ప్రస్తుతం భారత జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నారు. బ్యాటింగ్ బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ సమర్థత చూపిస్తూ జట్టుకు కీలక ప్రదర్శన అందిస్తున్నారు. భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా, అభిమానులు అతనిపై అపారమైన ప్రేమను చూపించడంలో ఎటువంటి తగ్గుదల ఉండదని స్పష్టమే.

ChampionsTrophy2025 JadejaRetirement RavindraJadeja TeamIndia ViratKohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.