📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!

Author Icon By Sai Kiran
Updated: January 16, 2026 • 9:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jadeja dropped from ODI : టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ Ravindra Jadeja వన్డే జట్టులో స్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి తర్వాత జడేజా ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతడి వన్డే కెరీర్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 27 పరుగులు మాత్రమే చేయగా, స్ట్రైక్‌రేట్ 61.36గా నమోదైంది. స్వంత మైదానంలోనూ జట్టు అవసరానికి తగ్గట్టు వేగంగా ఆడలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. మరోవైపు బౌలింగ్‌లోనూ జడేజా వికెట్లు తీయలేకపోయాడు.

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు వన్డేల్లో జడేజాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు Irfan Pathan, Aakash Chopra, Kris Srikkanth వంటి వారు బహిరంగంగా విమర్శించారు. “రీబిల్డింగ్ దశలో ఉన్నప్పటికీ 60 స్ట్రైక్‌రేట్‌తో కాదు, కనీసం 80 స్ట్రైక్‌రేట్‌తో ఆడాలి” అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

Read also : West Godavari: రూ.1.53 కోట్లతో భారీ కోడిపందెం?

“2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జడేజా వన్డే గణాంకాలు (Jadeja dropped from ODI) ఆశాజనకంగా లేవు” అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. జడేజా స్థానంలో Axar Patel కు అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉండగా, జనవరి 18న ఇండోర్‌లో జరిగే చివరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. ఆ మ్యాచ్‌లో జడేజా రాణిస్తాడో లేదో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదే సమయంలో అక్షర్ పటేల్ తనకు లభిస్తున్న అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు కీలక సమయంలో బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ జట్టు యాజమాన్యం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌లో జడేజాకు సమానమైన సామర్థ్యం ఉండటం అక్షర్‌కు అదనపు బలంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Axar Patel replacement Jadeja Breaking News in Telugu Google News in Telugu India cricket team updates India vs New Zealand ODI analysis Indian cricket breaking news Jadeja dropped from ODI Jadeja poor performance Jadeja vs Axar comparison Latest News in Telugu ODI squad selection India Ravindra Jadeja ODI future Team India all rounder news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.