ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు.పాకిస్థాన్ తీరును తప్పుబట్టాడు. ‘వందకు 100 శాతం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. మరో నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ దారికొస్తుంది. భారత్, పాక్ మ్యాచ్ చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ ఆడకుంటే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకే భారీ నష్టం వాటిల్లుతుంది.
Read Also: Shuttler: Thailand మాస్టర్స్ ఛాంపియన్ గా దేవికా సిహగ్
దీనంతటికీ వారి నీచపు బుద్దే కారణం
బ్రాడ్‌కాస్టర్లు పెద్ద మొత్తాల్లో నష్టపోతారు. మిగతా బోర్డులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఐసీసీ మీటింగ్‌లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. పీఎస్‌ఎల్ కోసం విదేశీ ఆటగాళ్లకు ఎన్‌ఓసీలు రావు. మిగతా క్రికెట్ బోర్డులు కూడా పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. ఇప్పటికే ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందాల్లో భాగంగా తటస్థ వేదికల్లో తలపడుతున్నాయి.
కాబట్టి ఓ ప్రత్యర్థితో నేను ఆడను అనడం ఆమోదయోగ్యం కాదు. పాకిస్థాన్‌కు పాకిస్థానే పెద్ద శత్రువు. దీనంతటికీ వారి నీచపు బుద్దే కారణం.’అని అశ్విన్ (Ravichandran Ashwin) అభిప్రాయపడ్డాడు.భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆదివారం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: