📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Ravichandran Ashwin : ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ : అశ్విన్

Author Icon By Divya Vani M
Updated: March 17, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ravichandran Ashwin : ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ : అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలో పోరాటపటిమకు మారుపేరుగా నిలిచిన అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్.ఓటమిని తలొగ్గని ఈ తమిళ తంబి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో మాత్రం తన మాయాజాలంతో అభిమానులను మరోసారి అలరించబోతున్నాడు. 18వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.కెరీర్ చివరి దశలో స్వస్థలం తమిళనాడుకు చెందిన ఫ్రాంచైజీ తరఫున ఆడే అవకాశం రావడం అశ్విన్‌కి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.దీన్ని తనకు పెద్ద గిఫ్ట్‌లా భావిస్తున్నాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు.ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.”ధర్మశాలలో నా 100వ టెస్టు ఆడాను. ఆ మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మెమెంటోను అందించింది. అయితే ఆ వేడుకకు ధోనీ హాజరవుతాడని ఆశపడ్డాను.ఆ జ్ఞాపికను అతని చేతుల మీదుగా స్వీకరించాలని ఎంతో ఎదురుచూశాను. కానీ అది సాధ్యపడలేదు.

Ravichandran Ashwin ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ అశ్విన్

నాలో కొంత నిరాశ కలిగింది.అదే నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిపోయిందని భావించాను.అయితే, ధోనీ తర్వాత నాకొక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు.ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్‌లోకి తిరిగి తీసుకోవడం ద్వారా నా కెరీర్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చాడు.ధోనీ వల్లనే ఈసారి సీఎస్కేలో ఆడే అవకాశం దక్కింది.ఇంత దశలో అంతకంటే మంచి కానుక మరేదీ ఉండదని అనిపిస్తోంది.ధోనీకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాను” అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.అశ్విన్ ఇప్పటికీ గరిష్టస్థాయిలో క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.సీఎస్కే తరఫున బరిలోకి దిగబోతుండటంతో, అభిమానుల్లో ఉత్సాహం. మరోసారి తన మాయాజాలంతో ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి అశ్విన్ సిద్ధంగా ఉన్నాడు.అతని అనుభవం ప్రతిభ సీఎస్కేకు ఈ సీజన్‌లో కీలక బలంగా మారనుంది.

AshwinInCSK AshwinReturnsToCSK ChennaiSuperKings CSK2024 IPL2024 MSDhoni RavichandranAshwin TeamIndia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.