📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Ravichandran Ashwin: టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా దూరంగా ఉండాలంటూ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Aanusha
Updated: November 29, 2025 • 6:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడిన బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడిన అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు బుమ్రాతో మంచి రిలేషన్ ఉంది.

Read Also: Sunil Shetty: మహిళా క్రికెటర్ జెమీమా పై సునీల్ శెట్టి ప్రశంసలు

టెస్ట్ క్రికెట్ ఆడవద్దని సలహా ఇచ్చేవాడిని

ప్రస్తుతం నేను అతని దగ్గరగా ఉండి ఉంటే.. బుమ్రాకు ఒకటే మాట చెప్పేవాడిని. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ప్రాధాన్యతమివ్వాలని సూచించేవాడని. మరీ అవసరమైతే తప్ప టెస్ట్ క్రికెట్ ఆడవద్దని సలహా ఇచ్చేవాడిని. కానీ అతనికి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడటం అంటే చాలా ఇష్టమనే సంగతి నాకు తెలుసు.

అతను వీలైనంత కాలం టెస్ట్ క్రికెట్ ఆడటానికే మొగ్గు చూపుతాడు. అది సవాల్‌తో కూడుకున్న విషయం అని కూడా తెలుసు. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టీ20 క్రికెట్ ఆడాలి. అతను అర్థరహిత వన్డేలు ఆడాలని నేను కోరుకోవడం లేదు. టెస్ట్‌లు.. అది కూడా విదేశాల్లో జరిగే మ్యాచ్‌ల్లోనూ అతను ఆడాలని కోరుకుంటున్నా.

Ravichandran Ashwin: Ashwin’s key comments on Bumrah’s stay away from Test cricket

అశ్విన్ వ్యాఖ్యలను ఏబీ డివిలియర్స్ ఏకీభవించాడు

టీమిండియా సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఇతర ఫాస్ట్ బౌలర్ల సేవల్ని ఉపయోగించుకోవాలి.’ అని అశ్విన్ (Ravichandran Ashwin) చెప్పుకొచ్చాడు. అశ్విన్ వ్యాఖ్యలతో ఏబీ డివిలియర్స్ (AB de Villiers) ఏకీభవించాడు. సొంతగడ్డపై జరిగే టెస్ట్ మ్యాచ్‌ల్లో బుమ్రా ఆడాల్సిన అవసరం లేదని,

కేవలం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్‌ల్లోనే ఆడాలని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్ నేపథ్యంలో వైట్‌బాల్ క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టాలని సూచించాడు. సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ (T20 series) తో బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Jasprit Bumrah latest news Ravichandran Ashwin Team India Telugu News Test Cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.