📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Ravi Shastri: నేను చూసిన వారిలో విరాట్ కోహ్లీ..బెస్ట్ కెప్టెన్

Author Icon By Anusha
Updated: August 15, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ బ్యాటర్, సారథి విరాట్ కోహ్లీనేనని స్పష్టం చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ కాలంలో భారత క్రికెట్ జట్టు ఎన్నో మైలురాళ్లు చేరుకుందని, తన కళ్ల ముందే ఆ విజయ గాథలు సాక్ష్యమై నిలిచాయని రవి శాస్త్రి గర్వంగా గుర్తుచేశాడు.రవి శాస్త్రి ప్రకారం, ధోనీ తరువాత టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తి విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా కోహ్లీ చూపిన క్రమశిక్షణ, పట్టుదల,గెలుపు పట్ల ఉన్న ఆరాటం జట్టును కొత్త శిఖరాలకు చేర్చిందని ఆయన పేర్కొన్నాడు. ఒక్క ఐసీసీ ట్రోఫీ అందుకోకపోయినా, కోహ్లీ సారథ్యంలో టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశాడు. ముఖ్యంగా 2018లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ (Test series) విజయం, 2021లో ఇంగ్లండ్‌లో అద్భుత ప్రదర్శన, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి కఠినమైన పిచ్‌లపై పోరాడిన తీరు,ఈ అన్ని విజయాలు కోహ్లీ నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

క్రికెట్‌లో అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రతిభపై కూడా శాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ప్రదర్శన అసాధారణమని, అతని ఫిట్‌నెస్ స్థాయి, ప్రిపరేషన్‌లోని నిబద్ధత, ఆటపై ఉన్న ప్యాషన్ ఇతరులకు స్ఫూర్తిదాయకమని చెప్పాడు. ఫిట్‌నెస్‌పై కోహ్లీ తీసుకొచ్చిన మార్పులు మొత్తం భారత జట్టును మరింత క్రీడాస్ఫూర్తి కలిగిన, చురుకైన జట్టుగా తీర్చిదిద్దాయని శాస్త్రి పేర్కొన్నాడు.విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్ చేరి తృటిలో టైటిల్ కోల్పోయింది. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ చరిత్రకెక్కాడు. అయితే అతని కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్ గెలవకపోవడం లోటుగా మిగిలింది. ఈ కారణంతోనే సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ 2024తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ అందించాడు.

Ravi Shastri

ఏ ఆటగాళ్లతో కలిసి ఆడుతారనే ప్రశ్నకు శాస్త్రి ఈ విధంగా బదులిచ్చాడు

ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవనంత మాత్రాన బాధ పడక్కర్లేదు. ఇక్కడ అదృష్టం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఐసీసీ టైటిల్ గెలిచే సత్తా మా జట్టుకు ఉన్నప్పటికీ మాకు కలిసి రాలేదు. అయినప్పటికీ మేం గొప్ప క్రికెట్ ఆడాం. హెడ్ కోచ్‌గా నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. బెన్ స్టోక్స్‌కు ప్రత్యర్థిగా ఆడటం తనకు ఇష్టమని రవి శాస్త్రి తెలిపాడు.ఈ తరంలో ఏ ఆటగాళ్లతో కలిసి ఆడుతారనే ప్రశ్నకు శాస్త్రి ఈ విధంగా బదులిచ్చాడు. ‘ బెన్ స్టోక్స్‌కు వ్యతిరేకంగా ఆడేందుకు నేను ఇష్టపడతాను. అతను ప్రపంచ స్థాయి ఆల్-రౌండర్. అతనితో పాటు చాలా మంది క్రికెటర్లు ఉన్నారు. మీరు ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్‌ను చూస్తే – కమిన్స్, హాజిల్‌వుడ్, నాథన్ లయన్. నేను వారితో కలిసి ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ఆడి ఉండేవాడిని.’అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kapil-devs-emotional-appeal-for-stray-dogs/sports/530405/

best batter best captain former head coach Ravi Shastri praise Kohli achievements led after Dhoni Team India former captain Virat Kohli Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.