📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Ravi Shastri: క్రికెటర్ లెజెండరీ ల సంపాదన 100 కోట్ల పైనే అంటున్న రవి శాస్త్రి

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు నేపథ్యంలో, బ్రిటన్ ప్రసార సంస్థ ఓ స్పోర్ట్స్ చానెల్ (Sports Channel) నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రవిశాస్త్రి, భారత క్రికెటర్ల ఆదాయంపై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకర్షించాయి.ఆ కార్యక్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ అడిగిన “భారత క్రికెట్ సూపర్‌స్టార్స్ ఎంత సంపాదిస్తారు?” అనే ప్రశ్నకు స్పందించిన రవిశాస్త్రి (Ravi Shastri), “సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లు ప్రతి ఏడాది రూ. 100 కోట్లకుపైనే సంపాదిస్తున్నారు” అని తేల్చి చెప్పారు. ఆయన స్పష్టంగా పేర్కొన్న విషయం ఏమిటంటే,ఈ సంపాదనలో ఎక్కువ భాగం వాణిజ్య ప్రకటనల ద్వారానే వస్తుందన్నది.

కంపెనీల బ్రాండ్

రవిశాస్త్రి పేర్కొన్నట్లు, ఈ క్రికెటర్లు తమ కెరీర్ సమయంలోనూ, రిటైర్మెంట్ తరువాత కూడా వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ జాతీయ జట్టుకు ఆడడం మానేశాక కూడా విపరీతమైన బ్రాండ్ విలువ కలిగి ఉన్నాడు. అతను ఇంకా సుమారు 15-20 కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌ (Brand Ambassador) గా ఉన్నాడు. ఇదే విధంగా ధోనీ కూడా క్రికెట్ నుంచి రిటైర్ అయినా, టీవీ adds, మల్టీ-నేషనల్ కంపెనీల బ్రాండ్ ప్రచారాల్లో భాగమవుతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు.భారత సూపర్ స్టార్స్ చాలా సంపాదిస్తారు. చాలా వరకూ వాణిజ్య ప్రకటనల ఒప్పందాల ద్వారానే ఆర్జిస్తారు. వారి ఆదాయం కచ్చితంగా పది మిలియన్ల పౌండ్ల పైనే ఉంటుందని చెప్పగలను. రూపాయాల్లో చెప్పాలంటే రూ. 100 కోట్ల పైనే సంపాదన ఉంటుంది. సచిన్, ధోనీ, విరాట్ వంటి ఆటగాళ్లు తమ కెరీర్ సమయంలోనూ కనీసం 15-20 ప్రకటనల్లో కనిపించేవారు.

Ravi Shastri: క్రికెటర్ లెజెండరీ ల సంపాదన 100 కోట్ల పైనే అంటున్న రవి శాస్త్రి

బహిర్గతం

ఇప్పటికీ వారు ప్రకటనల్లో నటిస్తూ సంపాదిస్తూనే ఉన్నారు.’అని రవిశాస్త్రి తెలిపాడు. ఈ సమాధానంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు.రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఒకపక్కగా క్రికెటర్ల ఆదాయాన్ని అందరికీ బహిర్గతం చేయడమే కాకుండా, భారత క్రికెట్ మార్కెట్ శక్తిని కూడా తెలియజేశాయి. సచిన్ (Sachin), ధోనీ, కోహ్లీ వంటి ఆటగాళ్లు తమ బ్రాండ్ విలువతో కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

రవి శాస్త్రి భార్య ఎవరు?

భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అయిన రవి శాస్త్రి మొదటి భార్య పేరు రీతూ సింగ్ (Ritu Singh). వీరిద్దరూ 1990, మార్చి 18న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అలేఖ శాస్త్రి (Alekha Shastri) అనే కుమార్తె ఉంది. కానీ, పెళ్లయిన 22 సంవత్సరాల తరువాత, వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

రవి శాస్త్రి జీతం ఎంత?

ఒక ప్రముఖ వార్తా నివేదిక ప్రకారం, భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రికి వార్షికంగా సుమారు రూ. 10 కోట్లు జీతంగా లభించింది. అతను కోచ్‌గా పనిచేస్తున్న సమయంలో మొదట రూ. 8 కోట్లు జీతం పొందేవాడు. తరువాత అది పెరిగి, రూ. 9.5 కోట్ల నుండి రూ. 10 కోట్లు మధ్య వార్షిక ప్యాకేజీగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ashwin: శుభ్‌మన్ గిల్‌కు అండగా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్

Brand Endorsements Breaking News Cricket Earnings Indian Cricketers Income latest news Michael Vaughan MS Dhoni Ravi Shastri Sachin Tendulkar Sports Discussion Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.