Ranji Trophy 2026 : రంజీ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్‌లో బెంగాల్ క్రికెటర్ సుదీప్ కుమార్ ఘరామి తృటిలో ఓ అరుదైన రికార్డును కోల్పోయారు. ఆంధ్రా జట్టుతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఆయన కేవలం ఒక్క పరుగు తేడాతో ట్రిపుల్ సెంచరీని మిస్ చేసుకున్నారు. 299 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటనగా మారింది.
రెండు రోజుల పాటు క్రీజులో నిలబడి ఆంధ్రా బౌలర్లను తీవ్రంగా అలసటకు గురిచేసిన ఘరామి, మొత్తం 596 బంతులు ఎదుర్కొని 31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. బెంగాల్ జట్టు ఒక దశలో 153 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో, ఘరామి తన మారథాన్ ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించారు.
ఆంధ్రా బౌలర్ షేక్ రషీద్ వేసిన బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయిన ఘరామి, 299 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. దీంతో రంజీ ట్రోఫీ చరిత్రలో 299 పరుగుల వద్ద ఔటైన తొలి బ్యాటర్‌గా అనవసర రికార్డు నమోదు చేశారు. గతంలో 1988లో శంతను సుగ్వేకర్ 299 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచినా, ఔటవడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Read Also: Devarapalli Ashram School: గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
ఘరామికి తోడుగా సుమంత గుప్తా (81), వికెట్ కీపర్ షాకిర్ హబీబ్ గాంధీ (95) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. చివర్లో మొహమ్మద్ షమీ కేవలం 33 బంతుల్లో 53 పరుగులు చేసి బెంగాల్ స్కోరును భారీగా పెంచారు. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 629 పరుగులు చేయగా, ఆంధ్రా 295 పరుగులకే ఆలౌట్ అయింది.
సుదీప్ ఘరామి పశ్చిమ బెంగాల్‌లోని నైహతి పట్టణానికి చెందినవాడు. కార్పెంటర్ అయిన తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే కుమారుడి క్రికెట్ కలకు అండగా నిలిచారు. ప్రస్తుతం బెంగాల్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఘరామి, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు. భవిష్యత్తులో భారత జాతీయ జట్టుకు ఆడటమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: