📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఆర్సీబీ ఓటమి పై స్పందించిన రజత్ పటీదార్

Author Icon By Anusha
Updated: April 19, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ లో ప్రత్యర్థులను వారి సొంత వేదికలపై చిత్తు చేస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తమ సొంత వేదికపై మాత్రం మరోసారి ఓటమివైపు నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో మాదిరిగానే పంజాబ్‌తోనూ అదే రిపీట్‌ అయింది. శుక్రవారం వర్షం అంతరాయంతో 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 96 పరుగుల ఛేదనలో పంజాబ్‌ 12.1 ఓవర్లలో 98/5 స్కోరు చేసింది. నేహాల్‌ వధేరా(19 బంతుల్లో 33 నాటౌట్‌, 3ఫోర్లు, 3సిక్స్‌లు) జట్టు విజయంలో కీలకమయ్యాడు. హాజిల్‌వుడ్‌(3/14), భువనేశ్వర్‌(2/26) ఆకట్టుకున్నారు.తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ బ్యాటర్ల వైఫల్యంతో 14 ఓవర్లలో 95/9కే పరిమితమైంది. అనిశ్చితికి మారుపేరైన ఆర్‌సీబీ బ్యాటింగ్‌ లైనప్‌ ఓపెనర్లు నిష్క్రమించగానే పెవిలియన్‌కు క్యూ కట్టింది. సాల్ట్‌ (4), కోహ్లీ (1), లివింగ్‌స్టొన్‌ (4), జితేశ్‌ (2), కృనాల్‌ (1) అలా వచ్చి ఇలా వెళ్లారు. టిమ్‌ డేవిడ్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్‌ పటీదార్‌ (18 బంతుల్లో 23, 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. పంజాబ్‌ బౌలర్లలో మార్కో యాన్సన్‌ (2/10), చాహల్‌ (2/11), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/23), హర్‌ప్రీత్‌ (2/25) తలా రెండు వికెట్లు తీసి ఆర్‌సీబీని కట్టడిచేశారు.

ఓపెనర్ల

ఆర్‌సీబీ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యఛేదనను పంజాబ్‌ నెమ్మదిగా మొదలుపెట్టింది. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌లో 3 పరుగులే రాగా రెండో ఓవర్‌ నుంచి పంజాబ్‌ ఓపెనర్లు ప్రియాన్ష్‌, ప్రభ్‌సిమ్రన్‌ బ్యాట్లు ఝులిపించారు. దయాల్‌ రెండో ఓవర్‌లో ప్రియాన్ష్‌ స్లిప్‌పై నుంచి కొట్టిన షాట్‌ బౌండరీకి దూసుకెళ్లింది. భువీ ఓవర్‌లో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టి డేవిడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 22 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌పడింది.ఆ తర్వాత 10 పరుగుల తేడాతో ప్రియాన్ష్‌ కూడా ఔట్‌ కావడంతో పంజాబ్‌ 32 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో శ్రేయాస్‌(7)తో పాటు, ఇంగ్లిస్‌(14) ఔట్‌ చేయడం,హాజిల్‌వుడ్‌ ఆర్‌సీబీకి అదిరిపోయే బ్రేక్‌ ఇచ్చాడు. అయితే క్రీజులో కుదరుకున్న నేహాల్‌ వధేరా బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలతో చెలరేగాడు. శశాంక్‌ (1) నిరాశపరిచినా స్టొయినిస్‌(7 నాటౌట్‌)తో కలిసి నేహాల్‌ జట్టును గెలిపించాడు.

అద్భుతంగా

ఓటమి తర్వాత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ.. “పిచ్ స్టిక్కిగా, టు పేస్డ్ గా ఉంది. అయినా కూడా మా బ్యాటింగ్ యూనిట్‌గా ఇంకా మెరుగ్గా ఆడొచ్చు. భాగస్వామ్యాలు ఎంతో కీలకం. కానీ మేము త్వరగా వికెట్లు కోల్పోయాం. ఇది మాకు పెద్ద గుణ పాఠం. పిచ్ మరి అంత బ్యాడ్ గా లేదు. కాకపోతే చాలా సేపు కవర్ల కింద ఉంచటం వల్ల వాళ్ల బౌలర్లకు బాగా సాయపడింది. వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ ఎలా ఉన్నా సరే, మేము బాగా బ్యాటింగ్ చేయాల్సింది. విజయం సాధించగలిగే స్కోర్ చేయాల్సింది. మా బౌలింగ్ యూనిట్ మంచి ప్రదర్శనే చేసింది. ఇది మాకు పెద్ద ప్లస్ పాయింట్. బ్యాటర్లు మంచి ఇంటెంట్ తో ఆడారు. అది మంచి విషయం. కొన్ని చిన్న తప్పులను సరిదిద్దుకుంటే మా బ్యాటింగ్ యూనిట్‌గా మరింత మెరుగ్గా అవుతుంది.” అని రజత్ పటీదార్ పేర్కొన్నాడు.

Read Also: IPL 2025: అసాధారణ బ్యాటింగ్‌తోనే విజయం సాధించాం: శ్రేయస్ అయ్యర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.