Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ విషయంలో యువ స్టార్ యశస్వి జైస్వాల్ కు ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి రావొచ్చని మాజీ భారత ఆటగాడు రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ ఎవరు అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.
సంజూ శాంసన్ అందుబాటులో లేని సమయంలో ఐపీఎల్ 2025లో రియాన్ పరాగ్ జట్టును నడిపారు. ఆ సమయంలోనే యువ ఆటగాళ్ల మధ్య అసంతృప్తి ఉందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇక శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ కావడంతో రాజస్థాన్ రాయల్స్‌కు నాయకత్వ సమస్య మరింత చర్చకు వచ్చింది.
Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు
ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) చేరడం కీలకంగా మారింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం జడేజాకు ఉండటం వల్ల, అతడే కెప్టెన్ అవుతాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
“నాయకత్వ పోటీ ప్రధానంగా రియాన్ పరాగ్, రవీంద్ర జడేజాల మధ్యే ఉంటుందని నా అభిప్రాయం. యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ అవకాశానికి ఇంకొంత సమయం పట్టొచ్చు” అని ఉతప్ప తెలిపారు.
ఇక మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా కెప్టెన్సీ అంశమే రాజస్థాన్ రాయల్స్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని అన్నారు. “సరైన నాయకుడిని ఎంపిక చేసి, దానిపై స్పష్టత ఇవ్వడం మేనేజ్‌మెంట్ బాధ్యత” అని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: