ఫుడ్‌బాల్ లెజెంట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్‌లో భాగంగా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు.ఈ హై-ప్రొఫైల్ కార్యక్రమానికి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిసెంబర్ 13వ తేదీ (శనివారం) సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి బయల్దేరి, రాత్రి 7:15 గంటలకు మైదానానికి వస్తారు రాహుల్ గాంధీ (Rahul Gandhi).
Read Also: Messi: భారత్ కు చేరుకున్న మెస్సీ
టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతి
రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొననున్నారు.ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ..
మ్యాచ్ కోసం 2500 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ప్రేక్షకుల సౌకర్యార్థం 34 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు ఆయన వివరించారు. మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: