Rahul chahar divorce : భార్యతో విడాకులు ప్రకటించిన క్రికెటర్ రాహుల్ చహర్

Read Time:  1 min
Rahul chahar divorce
Rahul chahar divorce
FONT SIZE
GET APP

Rahul chahar divorce : భారత యువ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికాడు. తన భార్య ఈశాని జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపాడు.

రాహుల్ చహర్ మరియు ఫ్యాషన్ డిజైనర్ ఈశాని జోహర్ కొంతకాలం ప్రేమలో ఉండి, 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2022 మార్చి 9న గోవాలో వీరి వివాహం జరిగింది. అయితే నాలుగేళ్లకు ముందే వారి దాంపత్య జీవితం ముగిసింది. గత 15 నెలలుగా కోర్టు ప్రక్రియలో ఉన్నట్లు రాహుల్ తన ప్రకటనలో వెల్లడించాడు.

Read Also: Azharuddin Minister Post : అజహరుద్దీన్ పదవికి గండం ?

Rahul chahar divorce
Rahul chahar divorce

తన సోషల్ మీడియా పోస్టులో రాహుల్ భావోద్వేగంగా స్పందిస్తూ, జీవితంలోని ఒక అధ్యాయం ముగిసిందని పేర్కొన్నాడు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల తనకు పూర్తి అవగాహన లేకపోయిందని, కొన్ని సంబంధాలు మనకు జీవిత పాఠాలు నేర్పుతాయని తెలిపాడు. ఇప్పుడు స్పష్టతతో, ఆత్మగౌరవంతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని పేర్కొన్నాడు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రాహుల్ చహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.5.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్న ఈ యువ క్రికెటర్ వ్యక్తిగత జీవిత పరిణామాలతో కూడా వార్తల్లో నిలిచాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.