📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Radhika Yadav: మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 12:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో చోటుచేసుకున్న మహిళా టెన్నిస్ క్రీడాకారిణి హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.  రాధికా యాదవ్(25) అనే యువతిని, సెక్టార్ 57 లోని తమ ఇంట్లో గన్‌తో కాల్చి చంపాడు తండ్రి. 5 రౌండ్ల కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయపడిన రాధిక యాదవ్ (Radhika Yadav) చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులునిర్ధారించారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్‌లో 113వ స్థానంలో కొనసాగుతోంది మృతురాలు రాధికా యాదవ్. రాధిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కూతురు సంపాదన మీద బతుకుతున్నావా? అది ఓ బతుకేనా ఇలాంటి సూటిపోటి మాటలు తండ్రిలోని రాక్షసత్వాన్ని నిద్ర లేపాయి. ఏకంగా కూతురు ప్రాణాలు తీసేలా చేశాయి. హర్యానాలోని గురుగ్రామ్‌ (Gurugram) లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైన వార్త సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది.

ప్రోత్సహించేందుకు

తమ నివాసంలోనే ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.రాధికా యాదవ్‌ రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, కొద్ది కాలం క్రితం జరిగిన టెన్నీస్‌ పోటీల్లో పాల్గొన్న రాధికా యాదవ్‌కు తీవ్ర గాయం కావడంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది. కొంతకాలం టెన్నీస్‌కు దూరం కావడంతో మానసికంగా కృంగిపోయింది. అయితే తనలాగా టెన్నీస్‌లో రాణించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు టెన్నీస్‌ అకాడమనీ ప్రారంభించింది. అనతికాలంలో తన కోచింగ్‌తో రాధికా యాదవ్‌ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తండ్రికి కూడా చేదోడు వాదోడుగా నిలిచింది.అయితే దీపక్‌ యాదవ్‌ (Deepak Yadav) కుటుంబానికి పేరు, ప్రతిష్టలు రావడం ఇష్టం లేని ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలు అనడం ప్రారంభించారు.

Radhika Yadav: మహిళా టెన్నిస్ ప్లేయర్‌ రాధికా యాదవ్ ని కాల్చి చంపిన తండ్రి..కారణమిదే?

తన కుమార్తె కెరీర్, సంపాదనపై

రాధిక టెన్నిస్ అకాడమీ ఆదాయంపై దీపక్ ఆధారపడి జీవిస్తున్నాడని ఎగతాళి చేసేవారట. ఈ అవమానమే అతడి కోపాన్ని పెంచింది. రాధిక తన టెన్నిస్ అకాడమీ (Tennis Academy) ని మూసివేయాలని తండ్రి కోరాడు. కానీ ఆమె అందుకు నిరాకరించింది. తన కుమార్తె కెరీర్, సంపాదనపై సమాజం నుంచి వస్తున్న విమర్శల కారణంగా కూతురి ప్రాణం తీసినట్లు తండ్రి దీపక్‌ పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు.

మహిళా టెన్నిస్ అంటే ఏమిటి?

మహిళా టెన్నిస్ అనేది మహిళల మధ్య ఆడే టెన్నిస్ ఆట. ఇది సింగిల్స్ (ఒకరు vs ఒకరు) డబుల్స్ (ఇద్దరు vs ఇద్దరు) ఫార్మాట్లలో ఆడతారు. అంతర్జాతీయ స్థాయిలో WTA (Women’s Tennis Association) ఈ ఆటను నిర్వహిస్తుంది.

భారతదేశానికి చెందిన ప్రఖ్యాత మహిళా టెన్నిస్ క్రీడాకారిణులు ఎవరు?

సానియా మీర్జా – గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణి.అనుక్రితీ నారాయణ్, ఆస్తా అరోరా, కెమెష్ మాలిక్ లాంటి యువ క్రీడాకారిణులు కూడా ఎదుగుతున్నవారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Gautam Gambhir: దేశం కోసం ఆడాలని క్రీడాకారులకు గంభీర్ సూచన

Breaking News Gurugram shocking news Haryana girl killed by father Indian tennis player tragedy Radhika Yadav murder Telugu News women tennis player shot dead

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.