షట్లర్ పీవీ సింధు (PV Sindhu), ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన ఆమెకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read Also: BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్
లెజెండరీ హోదా
2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన సింధు, గత 16 ఏళ్లలో నిలకడైన ప్రదర్శనతో ఈ స్థాయికి చేరుకుంది. ఇందులో ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం వంటి ప్రతిష్టాత్మక విజయాలు ఉన్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన టాప్-10 క్రీడాకారిణుల జాబితాలో సింధు (PV Sindhu)ఇప్పుడు స్థానం సంపాదించింది.
బ్యాడ్మింటన్ వంటి శారీరక శ్రమతో కూడిన క్రీడలో 500 విజయాలు సాధించడం అనేది ఒక క్రీడాకారిణి ఫిట్‌నెస్, అంకితభావానికి నిదర్శనం. గాయాల బారిన పడినా, ఫామ్ కోల్పోయినా మళ్లీ పుంజుకుంది సింధు. సైనా నెహ్వాల్ తర్వాత భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సింధు, ఈ 500 విజయాల మైలురాయితో తన లెజెండరీ హోదాను మరింత సుస్థిరం చేసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: