పుదుచ్చేరి (Puducherry) లో, అండర్–19 జట్టు హెడ్ కోచ్ ఎస్. వెంకటరమణపై ముగ్గురు స్థానిక ఆటగాళ్లు దాడి చేసిన ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వివాదం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం జట్టును సెలక్ట్ చేయడంలో జరిగిన తగాదాతో ముడిపడి ఉంది. జట్టులో తమకు స్థానం దక్కకపోవడంతో ఆగ్రహించిన ఆటగాళ్లు కోచ్‌పై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో కోచ్ తలకు, భుజానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు.
Read Also: Lionel Messi: ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ
నుదిటిపై 20 కుట్లు పడ్డాయి
సోమవారం ఉదయం సీఏపీ (Cricket Association of Pondicherry) ఇండోర్ నెట్స్‌లో ఈ దాడి జరిగింది. కోచ్ వెంకటరమణ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షిస్తుండగా, ముగ్గురు స్థానిక ఆటగాళ్లు కార్తికేయన్ జయసుందరం, ఏ.అరవిందరాజ్, ఎస్.సంతోష్ కుమారన్ అక్కడికి చేరుకున్నారు. వారు కోచ్‌తో దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించారని,
ఈ వాగ్వాదం తీవ్రమవడంతో ఆటగాళ్లు కోచ్‌ను బ్యాట్‌తో కొట్టారని ఆరోపణ. పోలీసుల సమాచారం ప్రకారం, వెంకటరమణకు నుదిటిపై 20 కుట్లు పడ్డాయి, భుజానికి ఫ్రాక్చర్ కూడా అయింది. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ, దాడి చేసిన ఆటగాళ్లు పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: