📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Prithvi Shaw: ఎవరి సానుభూతి పై ఆధారపడి నేను ముందుకెళ్లట్లేదు

Author Icon By Anusha
Updated: August 20, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియాలో ఒకప్పుడు “యువ సంచలనం”గా పేరు పొందిన స్టార్ ఓపెనర్ ప్రథ్వీ షా (Prithvi Shaw) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కొంతకాలంగా క్రమశిక్షణ సమస్యలు, ఫిట్‌నెస్ లోపాలు, గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ప్రతిభావంతుడు మళ్లీ తన బ్యాట్‌తో జవాబు చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో మరో కొత్త ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభిస్తూ తన సామర్థ్యాన్ని మరోసారి చాటుకున్నాడు.బుచ్చిబాబు ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా మహారాష్ట్ర తరఫున ఛత్తీస్‌గఢ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రథ్వీ షా (111 పరుగులు) శతకంతో కదం తొక్కాడు. మహారాష్ట్రకు విజయాన్ని అందించలేకపోయినా, అతని ఇన్నింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) నిర్దేశించిన 242 పరుగుల లక్ష్య ఛేదనలో మహారాష్ట్ర జట్టు 217 పరుగులకే ఆలౌటైనా, షా ఒక్కడే సింహస్వప్నం లా పోరాడాడు. జట్టు మొత్తం పరుగులలో సగానికి పైగా షా ఒక్కడే సాధించడం అతని నైపుణ్యాన్ని మళ్లీ గుర్తు చేసింది.

నా సామర్థ్యంపై, నా కష్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది

ఒకప్పుడు భారత క్రికెట్‌లో భవిష్యత్ హీరోగా వెలుగొందిన పృథ్వీ షా, ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయి విమర్శల పాలయ్యాడు. అయితే, ఈ ఇన్నింగ్స్ (innings) తర్వాత అతను తన పునరాగమనంపై ధీమా వ్యక్తం చేశాడు. “నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా సామర్థ్యంపై, నా కష్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సీజన్ నాకు, నా జట్టుకు బాగా కలిసి వస్తుందని ఆశిస్తున్నాను” అని షా మ్యాచ్ అనంతరం తెలిపాడు.తన ఆటలో పెద్దగా మార్పులు చేయలేదని, కేవలం బేసిక్స్‌పై దృష్టి పెట్టానని షా వివరించాడు. ముఖ్యంగా మనసును డైవర్ట్ చేసే సోషల్ మీడియా వంటి వాటికి దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశాడు.

Prithvi Shaw

దీని గురించి తాను ఆలోచించడం లేదన్నాడు

సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉంది. దానికి దూరంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది” అని షా వ్యాఖ్యానించాడు.ఈ సెంచరీ తర్వాత మాజీ ఆటగాళ్లు లేదా సహచరుల నుంచి ఏమైనా సందేశాలు వచ్చాయా అని అడగ్గా.. ఎవరూ స్పందించలేదని షా చెప్పాడు. అయితే, దీని గురించి తాను ఆలోచించడం లేదన్నాడు. “నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు. నా కుటుంబం, కష్టకాలంలో నాకు అండగా నిలిచిన స్నేహితులు ఉన్నారు. మానసికంగా బాగాలేనప్పుడు వాళ్లే నాతో ఉన్నారు. అది చాలు” అని పృథ్వీ షా తన మనసులోని మాటను బయటపెట్టాడు.

అతని అంతర్జాతీయ కెరీర్ ఎలా ప్రారంభమైంది?

పృథ్వీ షా 2018లో వెస్టిండీస్‌పై జరిగిన టెస్టులో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లోనే శతకం సాధించి రికార్డు సృష్టించాడు.

పృథ్వీ షా ఏ సమస్యలతో జట్టుకు దూరమయ్యాడు?

క్రమశిక్షణ సమస్యలు, ఫిట్‌నెస్ లోపం, అలాగే కొన్ని వివాదాల కారణంగా అతను కొంతకాలం జట్టుకు దూరమయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/asia-cup-2025-ashwin-fires-back-at-yashasvi-jaiswals-omission/national/533050/

Prithvi Shaw prithvi shaw century prithvi shaw comeback prithvi shaw domestic cricket prithvi shaw fitness issues prithvi shaw form Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.