📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Prithvi Shaw: స్నేహితులతోనే కెరీర్ పాడయ్యిందన్న పృథ్వీ షా

Author Icon By Sharanya
Updated: June 26, 2025 • 5:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యంగ్ బ్యాటింగ్ టాలెంట్‌గా వెలుగులోకి వచ్చిన పృథ్వీ షా,(Prithvi Shaw) అత్యంత చిన్న వయసులోనే అండర్-19 ప్రపంచకప్ విజేతగా కెప్టెన్‌గా ఎదగడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అప్పటినుంచి అతడి ఆటతీరును చూసిన క్రికెట్ నిపుణులు, అభిమానులు, మాజీ ఆటగాళ్లంతా “వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో మరొక అగ్రగామి బ్యాటర్” అని ఆశాజనక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం కౌంటీ, దేశవాలీ మ్యాచ్​ల్లో ఆడుతున్నప్పటికీ పృథ్వీకి టీమ్ఇండియాలో చోటు కష్టంగా మారింది. మరోవైపు ఐపీఎల్​లోనూ అన్​సోల్డ్​గా మిగిలిపోవడం, అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో చిక్కుకోవడంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో పృథ్వీ తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆటపై దృష్టిపెట్టకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు.

కెరీర్ ప్రారంభం – ఆశలు, అద్భుతాలు

అండర్ 19లో సత్తా చాటిన పృథ్వీకి టీమ్ఇండియాలో 2018లో చోటు దక్కింది. అతడి బ్యాటింగ్ స్టైల్​ చూసి టీమ్ఇండియా ఫ్యూచర్ స్టార్ అని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ తర్వాత ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయి పృథ్వీ ఇబ్బందులు పడ్డాడు. అంతర్జాతీయ కెరీర్​లో 5 టెస్టు, 6 వన్డే, 1 టీ20 మ్యాచ్​లో పృథ్వీ టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక చివరిసారిగా 2021 జూలైలో భారత్​కు, 2024లో ఐపీఎల్​లో ఆడాడు.

క్షీణత – ఫిట్‌నెస్, క్రమశిక్షణ లోపాలు

ప్రారంభంలో ఊహించని స్థాయిలో మెరిసిన పృథ్వీ షా, కెరీర్​లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. క్రికెట్‌కు తక్కువ సమయం ఇస్తున్నానని అర్థమైంది. అయితే 2023 వరకు నేను రోజులో సగం సమయం మైదానంలోనే ఉండేవాడిని. కానీ, ఆ తర్వాత కొన్ని చెడు విషయాలవైపు వెళ్లాను. కొంతమంది తప్పుడు వ్యక్తులతో ఫ్రెండ్​షిప్ చేశాను. అయికే కెరీర్​లో మనం సక్సెస్ అయినప్పుడు అనేక మంది స్నేహితులు మన దగ్గరకు వస్తారు. నాకూ అదే పరిస్థితి ఎదురై, లైన్ తప్పాను. దీంతో అంతకుముందు రోజులో 8 గంటలు గ్రౌండ్​లో ఉండే నేను, కొత్త పరిచయాల తర్వాత ​4 గంటలే గడిపాను’

మానసిక ఒత్తిడి – వ్యక్తిగత సమస్యలు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ మాట్లాడుతూ, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మా తాతయ్య చనిపోయారు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన మరణంతో కుంగిపోయాను. ఆ తర్వాత చాలా జరిగాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోలేను. నా తప్పిదాలను నేను అంగీకరించా. ఆ పరిస్థితుల్లో మా నాన్న నాకు మద్దతుగా నిలిచారు. కష్ట సమయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారు’ అని పృథ్వీ షా వివరించాడు.

Read also: India-Pakistan: వచ్చే నెలలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్

#CareerLessons #CricketComeback #CricketerConfession #CricketNews #DisciplineMatters #IndianCricket #PrithviShaw #PrithviShawInterview Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.