దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన జాంటీ రోడ్స్, ఢిల్లీ వాయు కాలుష్యంపై (pollution) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కుటుంబంతో గోవాలో నివసిస్తున్న రోడ్స్, ఢిల్లీకి రాగానే గాలి నాణ్యత ఎంత దారుణంగా ఉందో వెంటనే అర్థమైందని అన్నారు. ఈ కాలుష్య వాతావరణంలో పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోమని ప్రోత్సహించడం ఎలా సాధ్యమని ఆయన ఆవేదన చెందారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోడ్స్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : Chittoor: AP ప్రజలకు శుభవార్త.. జనవరి నుంచి సంజీవని పథకం అమలు
గోవాతో ఢిల్లీ పోలిక, నివాసానికి ఇబ్బంది
“మేము గోవాలో సముద్రం పక్కన నివసిస్తాం. అక్కడ పరిశ్రమలు తక్కువ, గాలి ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఢిల్లీకి రాగానే ఆ తేడా స్పష్టంగా తెలిసింది” అని రోడ్స్ వివరించాడు. క్రీడలను ప్రోత్సహిస్తూ పిల్లలను బయట ఆడుకోమని చెప్పే తాను, ఢిల్లీ పరిస్థితులు చూసి అయోమయానికి గురయ్యానని తెలిపారు. “ఢిల్లీలో పిల్లలు బయట చాలా సమయం గడుపుతారు. ఇంతటి విషపూరితమైన గాలిలో అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు” అని ఆయన అన్నారు. “ఒక తండ్రిగా, క్రీడాకారుడిగా నేను ఢిల్లీలో నివసించడానికి చాలా ఇబ్బంది పడతాను” అని స్పష్టం చేశారు.
బీసీసీఐ నిర్ణయం సరైనదే, స్పోర్ట్స్ సిటీపై ప్రశంస
కాలుష్యం కారణంగా బీసీసీఐ అండర్-23 నాకౌట్ మ్యాచ్‌లను ఢిల్లీ (Delhi) నుంచి ముంబైకి తరలించడం సరైన నిర్ణయమని రోడ్స్ అభిప్రాయపడ్డారు. చాలా క్రికెట్ అకాడమీలు తమ టూర్‌లను ఢిల్లీకి రద్దు చేసుకొని గోవాకు వస్తున్నాయని, ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువైనా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నాయని చెప్పాడు. అదే సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం తలపెట్టిన 102 ఎకరాల ‘స్పోర్ట్స్ సిటీ’ ప్రాజెక్టును రోడ్స్ (Rhodes) ప్రశంసించారు. “ఒక దక్షిణాఫ్రికా క్రీడాభిమానిగా నాకు కొంచెం ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సౌకర్యాలతో భారత క్రీడాకారులు మరింత రాణిస్తారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :