📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: PM Modi: ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా.. ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: November 3, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళల వన్డే ప్రపంచకప్‌ (Women’s ODI World Cup) లో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం అందుకుంటోంది. తొలిసారిగా ప్రపంచకప్ విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో టీమిండియా మహిళా క్రికెటర్లు భేటీ కానున్నారు.

Read Also: Mithali Raj: విజయం వెనుక నాలుగేళ్ల ప్రణాళిక నమ్మకం ఉన్నాయి

ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ (BCCI) జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది.ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షఫాలీ వర్మ (87) అద్భుత ఇన్నింగ్స్, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ దీప్తి శర్మ (58) మెరుపులతో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోరు సాధించింది.అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) శతకంతో పోరాడినా, భారత బౌలర్ల ధాటికి తలవంచక తప్పలేదు.

PM Modi

వికెట్ తీయగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి

ముఖ్యంగా దీప్తి శర్మ (Deepti Sharma) 5 వికెట్లతో సత్తా చాటడంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి ఆఖరి వికెట్ తీయగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. భారత సీనియర్ మహిళల జట్టుకు ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది.ప్రస్తుతం నవీ ముంబైలో ఉన్న క్రీడాకారిణులు,

సహాయక సిబ్బంది మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం వారు తమ స్వస్థలాలకు వెళతారు. జట్టుకు ప్రకటించిన రూ. 51 కోట్ల నగదు బహుమతిని క్రీడాకారులు, సహాయక సిబ్బంది,

ఐదుగురు సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీకి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.లీగ్ దశలో వరుసగా మూడు ఓటముల తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమిండియా, సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి, స్వదేశంలో అభిమానుల మధ్య టైటిల్ గెలిచి దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Harmanpreet Kaur team ICC Women’s World Cup India women world cup champions latest news Narendra Modi meeting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.