📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

PKL 2024: ప్చ్.. తెలుగు టైటాన్స్‌కు ఘోర పరాజయం

Author Icon By Divya Vani M
Updated: October 22, 2024 • 10:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్ (పీ కే ఎల్) సీజన్ 11లో తెలుగు టైటాన్స్‌ను ఎదుర్కొంటున్న కష్టాలు కొనసాగుతున్నాయ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా తెలుగు టైటాన్స్ తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకుంది హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 22-52తో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో చిత్తుకుంది ఈ మ్యాచ్‌లో జైపూర్ కెప్టెన్ అర్జున్ దేశ్‌వాల్ అద్భుత ప్రదర్శన కనబర్చారు ఆయన 19 పాయింట్లు సాధించడంతో పాటు అభిజిత్ మాలిక్ 8 పాయింట్లతో సహకరించారు తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 7 పాయింట్లు సాధించగా ఆశిష్ నర్వాల్ మరియు విజయ్ మాలిక్ వరుసగా 5 పాయింట్లతో నిలిచారు.

ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగింది మొదటి భాగం ముగిసే సమయానికి జైపూర్ 18-13తో 5 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది కానీ సెకండాఫ్‌లో జైపూర్ ఏకంగా 34 పాయింట్లు సాధించడంతో తెలుగు టైటాన్స్ 9 పాయింట్లకే పరిమితమైంది ఆ మ్యాచ్‌లో జైపూర్ మూడు సార్లు తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేసింది సెకండాఫ్‌లో జైపూర్ దూకుడైన ఆటతో కట్టుదిట్టంగా ప్రదర్శించడంతో తెలుగు టైటాన్స్ 41 రైడ్స్‌లో 13 సార్లు మాత్రమే విజయవంతమైంది మరోవైపు జైపూర్ 40 ప్రయత్నాల్లో 23 సార్లు సక్సెస్ కావడంతో పాటు ఒకసారి సూపర్ రైడ్ కూడా సాధించింది ట్యాక్లింగ్‌లో తెలుగు టైటాన్స్ అసాధారణంగా విఫలమైంది 31 ప్రయత్నాల్లో 5 సార్లు మాత్రమే విజయవంతమైంది ఈ కష్టాల మధ్య తెలుగు టైటాన్స్ మొదట విజయంతో టోర్నీ ప్రారంభించినప్పటికీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం అభిమానులకు పెద్ద నిరాశను కలిగించింది వారు ఈ జట్టుకు మంచి విజయాలు రాబట్టాలని ఆశిస్తున్నారు.

ArjunDeshwal GachibowliStadium IndianSports JaipurPinkPanthers KabaddiCommunity KabaddiFans KabaddiMatch KabaddiPerformance KabaddiUpdates KabbadiHighlights MatchHighlights MatchReview PKLSeason11 ProKabaddiLeague SportsAnalysis SportsNews TeamPerformance TeluguTitans TeluguTitansLoss

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.