Karimnagar cricketer IPL : కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో 21 ఏళ్ల అమన్‌రావును రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. జిల్లా కుర్రాడు ప్రతిష్ఠాత్మక టోర్నీలో చోటు దక్కించుకోవడంతో కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ క్రీడాభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు, ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నీలో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు సాధించి సెలెక్టర్లతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నాడు.
Read also: CBN:రాజకీయాల్లో న్యాయం ఆలస్యం అయితే ప్రజాస్వామ్యానికి ముప్పు
అమన్‌రావుకు క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబ వారసత్వం ఉంది. ఆయన తండ్రి పేరాల మధుసూదన్‌రావు గతంలో జిల్లా (Karimnagar cricketer IPL) స్థాయి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. తాత పేరాల గోపాల్‌రావు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా సేవలందించారు. అమన్‌రావు స్వగ్రామం సైదాపూర్ మండలం వెన్నంపల్లి కాగా, ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
కరీంనగర్ బిడ్డ ఐపీఎల్‌లోకి ఎంపిక కావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్ సునీల్‌రావు సహా పలువురు ప్రముఖులు అమన్‌రావుకు అభినందనలు తెలిపారు. యువ క్రికెటర్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: