Pakistan Cricket Board : వైఖరిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు, బోర్డు మాజీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగిన నేపథ్యంలో, ఆ దేశానికి మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీని బహిష్కరిస్తామంటూ హెచ్చరించడం పాక్ క్రికెట్‌కు ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. ఇలా మొండిగా వ్యవహరించడం ఆత్మహత్యా సదృశమేనని వ్యాఖ్యానించారు.
భద్రతా కారణాలతో భారత్‌లో ఆడలేమని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ICC తిరస్కరించడంతో ఆ దేశం టోర్నీ నుంచి తప్పుకుంది. అయితే, బంగ్లాకు మద్దతుగా పీసీబీ తీసుకుంటున్న వైఖరిని పాక్ క్రికెట్ వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ ఈ వివాదంలోకి దిగాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల
పాకిస్థాన్ జట్టు తప్పనిసరిగా (Pakistan Cricket Board) వరల్డ్‌కప్‌లో పాల్గొనాలని మాజీ క్రికెటర్ Mohammad Hafeez స్పష్టం చేశారు. ఐసీసీతో సంబంధాలను చెడగొట్టుకుంటే పీసీబీ సాధించేది ఏముంటుందని మాజీ కార్యదర్శి Arif Ali Abbasi ప్రశ్నించారు. బంగ్లాదేశ్ డిమాండ్‌కు పాకిస్థాన్ తప్ప మరే క్రికెట్ బోర్డు మద్దతు ఇవ్వలేదని మాజీ ఛైర్మన్ Khalid Mahmood గుర్తు చేశారు.
ఈ వివాదంతో పాకిస్థాన్‌కు ప్రత్యక్ష సంబంధం లేదని మాజీ కోచ్ Mohsin Khan వ్యాఖ్యానించారు. పాక్ జట్టు ఇప్పటికే శ్రీలంకలోనే మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో, టోర్నీ నుంచి తప్పుకోవడం పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. ఇదే విషయాన్ని పాక్ దిగ్గజం Inzamam-ul-Haq కూడా సమర్థిస్తూ, మెగా టోర్నీలో పాల్గొనడమే పాక్ క్రికెట్‌కు మేలని అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: