📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Panvel Railway Station: అథ్లెట్ల కు రైలులో చేదు అనుభవం?

Author Icon By Aanusha
Updated: January 20, 2026 • 8:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Panvel Railway Station: Athletes have a bitter experience on the train?

భారత జాతీయ పోల్ వాల్ట్ రికార్డ్ హోల్డర్ దేవ్ మీనా, మరో అథ్లెట్ కుల్దీప్ యాదవ్‌కు రైలులో ఎదురైన చేదు అనుభవం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.మ క్రీడా పరికరాలైన పోల్స్‌ను రైలులో తీసుకెళ్తున్నారన్న కారణంతో టికెట్ తనిఖీ అధికారి (టీటీఈ) వారిని రైలు నుంచి బలవంతంగా దించేశారు. ఈ సంఘటన పన్వేల్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.‘ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

Read Also: WPL 2026: వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB

విషయం వెలుగులోకి

రైలులో పోల్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని టీటీఈ వాదించి, వారిని పన్వేల్ స్టేషన్‌లో దిగిపొమ్మని ఆదేశించారు. దీంతో ఇద్దరు అథ్లెట్లు సుమారు ఐదు గంటల పాటు స్టేషన్‌లోనే ఉండిపోయారు..ఈ ఘటనకు సంబంధించిన వీడియోను NNIS అనే స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో అథ్లెట్లు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి వివరిస్తూ కనిపించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో జాతీయ స్థాయి క్రీడాకారుల పట్ల రైల్వే సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వివాదంపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దేవ్ మీనా 5.35 మీటర్ల ఎత్తును అధిగమించి పురుషుల పోల్ వాల్ట్‌లో జాతీయ రికార్డు సృష్టించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

dev meena Indian Athletics latest news pole vault sports news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.