📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Rishabh Pant: రెండో టెస్టుకు కెప్టెన్ గా పంత్

Author Icon By Anusha
Updated: November 21, 2025 • 2:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెడనొప్పితో బాధపడుతున్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ (Shubman Gill) సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టుకు దూరమయ్యారు. ICUలో చికిత్స పొంది జట్టుతో పాటు గువాహటికి చేరుకున్న ఆయనకు ఇవాళ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు.

Read Also: Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. అభినందనలు తెలిపిన ప్రముఖులు

అందులో ఫెయిల్ కావడంతో జట్టు నుంచి రిలీజ్ చేశారు. కొద్దిసేపటి కిందటే గిల్ ముంబైకి పయనమయ్యారు. అక్కడ వైద్య నిపుణుల పర్యవేక్షణలో 3 రోజులు చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రేప‌టి నుంచి గువాహటి వేదికగా ఈ టెస్టు ప్రారంభం కానుంది.

కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులు ఆడిన తర్వాత గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గిల్ గైర్హాజరీతో భారత జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తుది జట్టులో ఎక్కువమంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటం జట్టుకు సమస్యగా మారింది.

Pant named captain for second Test

ఓపెనర్‌గా సాయి సుదర్శన్‌ అవకాశం!

గిల్ స్థానంలో జట్టులోకి వచ్చే రేసులో ఉన్న సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ కూడా ఎడమచేతి వాటం ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్‌ (Sai Sudarshan) కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. గిల్ ఆరోగ్యంపై రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని, అతని దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యత ఇస్తామని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశారు.

“గిల్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. కానీ, మళ్లీ నొప్పి తిరగబెట్టదనే గ్యారెంటీ ఉంటేనే ఆడిస్తాం. మాకు బలమైన బెంచ్ ఉంది. గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు కూడా రాణిస్తాడనే నమ్మకం ఉంది” అని ఆయన తెలిపారు. ఇప్పటికే సిరీస్‌లో 1-0తో వెనుకబడిన భారత్‌కు, కెప్టెన్ దూరం కావడం మరో సవాల్‌గా మారింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Rishabh Pant Shubman Gill fitness issue Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.