📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

PAK vs NED : ఓటమి నుంచి గెలుపు, ఫహీమ్ మ్యాజిక్!

Author Icon By Sai Kiran
Updated: February 8, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

PAK vs NED : టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి అంచున నిలిచినప్పటికీ, నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఆఖరి దశలో ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ పాక్‌కు చిరస్మరణీయ గెలుపును అందించింది.

148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (31 బంతుల్లో 47) దూకుడైన ఆరంభం అందించాడు. అయితే, మధ్య ఓవర్లలో నెదర్లాండ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో ఏడుగురు బ్యాటర్లు పెవిలియన్ చేరగా, పాకిస్థాన్ ఓటమి ముంగిట నిలిచింది.

Read Also: Soil testing : భూసార పరిరక్షణతోనే సాగు ముందడుగు

PAK vs NED

చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరమైన కీలక దశలో ఫహీమ్ అష్రాఫ్ ఒంటరిగా పోరాడాడు. లోగాన్ వాన్ బీక్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు సాధించి మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేశాడు. చివరి ఓవర్‌లో మరో బౌండరీతో జట్టుకు విజయం ఖాయం చేశాడు. ఫహీమ్ కేవలం 11 బంతుల్లో 29 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను పాకిస్థాన్ బౌలర్లు 147 పరుగులకే కట్టడి చేశారు. డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37), బాస్ డి లీడె (30) మాత్రమే పోరాడగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లు పడగొట్టగా, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు తీసి జట్టు విజయానికి బాటలు వేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Faheem Ashraf 29 runs Faheem Ashraf innings Google News in Telugu Latest News in Telugu Netherlands vs Pakistan score PAK vs NED last over drama PAK vs NED result Pakistan Cricket News Pakistan thrilling win Pakistan vs Netherlands T20 World Cup 2026 T20 World Cup match highlights Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.