Kabul Air Strikes: కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

Read Time:  1 min
Kabul Air Strikes: కాబూల్‌లో పాక్ మారణహోమం.. రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం
FONT SIZE
GET APP

Kabul Air Strikes: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ లక్ష్యంగా పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ దాడిలో మృతుల సంఖ్య 400కి చేరినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది స్పష్టంగా వార్ క్రైమ్ అని మండిపడ్డాడు.

Read Also: Summer Vacation Plans: యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

ఘోర మారణహోమం: 400 మంది బలి

ఈ ఘటనపై స్పందించిన రషీద్ ఖాన్ ఎలాంటి సందేహం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “పౌరుల ఇళ్లపై, విద్యాసంస్థలపై లేదా వైద్య సదుపాయాలపై దాడి చేయడం అది ఉద్దేశపూర్వకమైనదైనా, పొరపాటున జరిగినదైనా, అది వార్ క్రైమ్‌గానే పరిగణించాలి” అని స్పష్టం చేశాడు.ప్రస్తుతం పవిత్రమైన రంజాన్ నెలలో ఇలాంటి ఘటన జరగడం మరింత ఆందోళన కలిగిస్తోందని రషీద్ పేర్కొన్నాడు.

Pakistan massacre in Kabul.. Rashid Khan is extremely angry
Pakistan massacre in Kabul.. Rashid Khan is extremely angry

“మనుషుల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యం చూపించడం చాలా బాధాకరం, ఆందోళన కలిగించే విషయం” అని తన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నాడు. ఈ దాడి సమాజంలో విభేదాలను, ద్వేషాన్ని మరింత పెంచుతుందని రషీద్ ఖాన్ హెచ్చరించాడు. అంతేకాకుండా ఈ ఘటనపై యునైటెడ్ నేషన్స్‌తో పాటు ఇతర మానవ హక్కుల సంస్థలు తక్షణమే దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. “ఈ కఠిన సమయంలో నా అప్ఘన్ ప్రజలతో నేనున్నాను. మేము మళ్లీ కోలుకుంటాం, దేశంగా ఎదుగుతాం” అని భావోద్వేగంగా పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.