Pakistan boycott India match : భారత్ మ్యాచ్ బహిష్కరణ, పాక్ సెమీస్ ఆశలపై ముప్పా?

Read Time:  1 min
Pakistan boycott India match
Pakistan boycott India match
FONT SIZE
GET APP

Pakistan boycott India match : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు Pakistan Cricket Team సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీకి ముందు ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో సిరీస్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్, ఈ నిర్ణయంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్ నుంచి తప్పించిన అంశాన్ని నిరసిస్తూ, ఆ దేశానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది.

ఈ విషయంపై పాకిస్థాన్ ప్రధాని Shehbaz Sharif స్పందిస్తూ, ఇది క్రీడలకన్నా దేశ గౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ, ప్రభుత్వంతో పాటు పీసీబీ తీసుకునే నిర్ణయాలను ఆటగాళ్లు గౌరవిస్తారని తెలిపారు.

Read Also: OTT: మన శంకర వర ప్రసాద్‌ గారు ఓటీటీ డేట్ ఫిక్స్‌

Pakistan boycott India match
Pakistan boycott India match

ఈ బహిష్కరణ నిర్ణయం పాకిస్థాన్ సెమీఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రూప్ దశలో మిగిలిన అన్ని మ్యాచ్‌లను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్‌లో తడబడినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఎదురవుతోంది.

గ్రూప్‌లో పాకిస్థాన్‌కు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా వంటి జట్ల నుంచి గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి. గత ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిన అనుభవం పాక్‌ను ఇంకా జాగ్రత్తగా ఉండేలా చేస్తోంది. అలాగే బలమైన జట్లను ఓడించిన చరిత్ర ఉన్న నెదర్లాండ్స్ కూడా ప్రమాదకర ప్రత్యర్థిగానే మారింది.

ఇక పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్న నేపథ్యంలో వర్ష సూచనలు ఆందోళనను మరింత పెంచుతున్నాయి. కొత్త కోచ్ మైక్ హెసన్ నేతృత్వంలో జట్టు దూకుడుగా ఆడుతున్నా, భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం టోర్నీలో వారి ప్రయాణాన్ని మరింత క్లిష్టంగా మార్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.