📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Owais Shah: రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఓవైస్ షా

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 2:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఒవైస్ షా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్సన్-సచిన్ ట్రోఫీ 2025 సిరీస్‌లో రాహుల్ అద్భుత ప్రదర్శనలతో భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రెండు శతకాలు (137 – హెడింగ్లీ, 100 – లార్డ్స్)లో ఆకట్టుకున్న రాహుల్, తన బ్యాటింగ్ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ ప్రదర్శనలతో రాహుల్ భారత జట్టులో తదుపరి స్టార్ బ్యాటర్‌గా ఎదుగుతాడని, విరాట్ కోహ్లీ (Virat Kohli) తరహాలో నాయకత్వ భాద్యతలు నిర్వర్తించే స్థాయికి చేరుకుంటాడని ఒవైస్ షా అభిప్రాయపడ్డాడు.

గత టెస్ట్‌లలో

ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ గడ్డపై నాలుగు టెస్టు శతకాలు నమోదు చేసి, దిలీప్ వెంగస్కార్, సచిన్ టెండూల్కర్ రికార్డులను సమం చేసిన రాహుల్, రాహుల్ ద్రవిడ్ (6 శతకాలు) తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గత టెస్ట్‌లలో లార్డ్స్‌ సెంచరీతో పాటు, హెడింగ్లీ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులు, ఎడ్జ్‌బాస్టన్‌లో 55 పరుగులు చేసిన రాహుల్, భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.ఈ సిరీస్‌లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ 607 పరుగులతో టాప్ స్కోరర్ కొనసాగుతుండగా, పంత్ 425 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 375 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. అతి త్వరలోనే రాహుల్, శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి టీమిండియా టాప్ బ్యాటర్‌గా నిలుస్తాడని ఒవైస్ షా (Owais Shah) అన్నాడు.

Owais Shah: రాహుల్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ఓవైస్ షా

ప్రధాన బ్యాటర్‌

తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిన ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ప్రస్తుతం కేఎల్ రాహుల్ (KL Rahul) విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయ ఆటగాడిగా మారాడనిపిస్తోంది. కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు అతనే ప్రధాన బ్యాటర్‌గా ఉండేవాడు. అప్పుడు రాహుల్ సాధారణ బ్యాటర్‌గానే కొనసాగేవాడు. కానీ ఇప్పుడు రాహుల్ ప్రధాన బ్యాటర్‌గా మారాడు. వాస్తవానికి అతను రాణించాల్సిన సమయం ఇదే. విరాట్ కోహ్లీ లేకుండా జరుగుతున్న తొలి సిరీస్ ఇది. శుభ్‌మన్ గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. అతను ఇలా ఆడుతాడని నేను అస్సలు ఊహించలేదు. శుభ్‌మన్ గిల్ కంటే కేఎల్ రాహుల్‌పైనే టీమిండియా నమ్మకం పెట్టుకోవచ్చు.

మరో శతకం

ఒవైస్ షా, స్కై స్పోర్ట్స్ కామెంటరీలో మాట్లాడుతూ, కోహ్లీ తరహాలో రాణించగలిగే సత్తా రాహుల్‌కు ఉందనేది నా అభిప్రాయం. అతని టెక్నిక్, టెంపర్‌మెంట్ అద్భుతం. మరో 10-15 మ్యాచ్‌ల్లో రాహుల్, శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) ను వెనక్కి నెట్టేస్తాడు. మరో 12 నెలల సమయంలో అతను పరుగుల వరద పారించి టీమిండియా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడు.’అని ఒవైస్ షా పేర్కొన్నాడు.లీడ్స్‌లో శతకం(137) బాదిన కేఎల్ రాహుల్, లార్డ్స్‌లో 100 మరో శతకం సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకంజలో నిలిచింది. ఇరు జట్ల మధ్య జులై 23 నుంచి నాలుగో టెస్ట్‌ ప్రారంభం కానుంది.

కేఎల్ రాహుల్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

కేఎల్ రాహుల్ 1992 ఏప్రిల్ 18న కర్ణాటకలోని మంగళూరు నగరంలో జన్మించాడు.

రాహుల్ భార్య ఎవరు?

కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అథియా శెట్టి (సునీల్ శెట్టి కుమార్తె)ని 2023లో వివాహం చేసుకున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Brian Lara: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బ్రియాన్ లారా తీవ్ర ఆగ్రహం

Breaking News India vs England Test series 2025 KL Rahul latest test century 2025 KL Rahul vs Virat Kohli comparison latest news Owais Shah on KL Rahul Team India next batting star Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.