📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Junior Hockey World Cup 2025: జూనియర్ హాకీ వరల్డ్ కప్ లో పాక్ స్థానంలో పాల్గొననున్న ఒమన్

Author Icon By Aanusha
Updated: October 29, 2025 • 9:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ ఆతిథ్యమిస్తున్న జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ 2025 (Junior Hockey World Cup 2025) లో పాల్గొనమని పిలుపు వచ్చినా, చివరి నిమిషంలో పాకిస్థాన్‌ వైదొలగింది.. “భారత్‌లో జరగబోయే టోర్నమెంట్‌లో మేము ఆడము, తటస్థ వేదికపై అయితే మాత్రమే పాల్గొంటాము” అని పాకిస్థాన్‌ హాకీ సమాఖ్య ప్రకటించింది.పాక్ స్థానంలో ఒమన్ జట్టును వరల్డ్ కప్ కు ఎంపిక చేసింది.

Read Also: Suryakumar Yadav: సిక్సర్ల సునామీ! సూర్యకుమార్ 150 మైలురాయి

అసలేం జరిగిందంటే… భారత్ ఆతిథ్యమిస్తున్న హాకీ జూనియర్ ప్రపంచకప్‌ 2025 (Junior Hockey World Cup 2025) నుంచి పాకిస్థాన్ చివరి నిమిషంలో వైదొలగింది. దీంతో ఆ జట్టు స్థానంలో ఒమన్‌ (Oman) కు అవకాశం లభించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) అధికారికంగా ప్రకటించింది.

ఈ టోర్నమెంట్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు తమిళనాడులోని చెన్నై, మధురై నగరాల్లో జరగనుంది.జూనియర్ ఆసియా కప్ 2024లో ప్రదర్శన ఆధారంగా పాకిస్థాన్ ఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. అయితే, టోర్నీలో పాల్గొనేందుకు తాము పంపిన ఆహ్వానాన్ని పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ అంగీకరించలేదని, ఈ మేరకు తమకు సమాచారం అందించిందని FIH ఒక ప్రకటనలో తెలిపింది.

ఉత్తమ ర్యాంకులో ఉన్న ఒమన్‌కు ఈ అవకాశం

దీంతో ఆసియా కప్‌ (Asia Cup) లో తర్వాతి ఉత్తమ ర్యాంకులో ఉన్న ఒమన్‌కు ఈ అవకాశం దక్కింది.ఈ టోర్నీలో భారత్, చిలీ, స్విట్జర్లాండ్‌లతో పాటు పాకిస్థాన్ గ్రూప్-బిలో ఉంది. ఇప్పుడు పాక్ స్థానంలో ఒమన్ ఈ గ్రూప్‌లో చేరనుంది. పాకిస్థాన్ నిర్ణయం కోసం అంతర్జాతీయ హాకీ సమాఖ్య దాదాపు నెల రోజుల పాటు టోర్నీ డ్రాను వాయిదా వేసింది.

Hockey World Cup 2025

తమ ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం పాక్‌కు సమయం ఇచ్చినా, చివరికి వారు తప్పుకోవడంతో స్విట్జర్లాండ్‌ (Switzerland) లోని లూసాన్‌లోని తమ ప్రధాన కార్యాలయంలోనే డ్రాను పూర్తి చేయాల్సి వచ్చింది.భారత్‌లో జరిగే టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలగడం ఇది రెండోసారి.

మరిన్ని దేశాలకు అవకాశం కల్పించాలనే లక్ష్యం

ఇంతకుముందు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన పురుషుల ఆసియా కప్ నుంచి కూడా తప్పుకోగా, వారి స్థానంలో బంగ్లాదేశ్ ఆడింది. ఆ టోర్నీ ప్రపంచకప్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్ కావడంతో పాకిస్థాన్ ఆ అవకాశాన్ని కోల్పోయింది.

కాగా, 2025 నుంచి పురుషుల, మహిళల జూనియర్ హాకీ ప్రపంచకప్‌లలో 24 జట్లతో నిర్వహించాలని FIH నిర్ణయించింది. మరిన్ని దేశాలకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ మార్పు చేశారు. 2023లో కౌలాలంపూర్‌లో జరిగిన గత ఎడిషన్‌లో జర్మనీ విజేతగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Breaking News Junior Hockey World Cup 2025 latest news Pakistan hockey team Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.