📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

ODI World Cup 2027: గంభీర్‌కు నిజమైన పరీక్ష అప్పుడే: గంగూలీ

Author Icon By Aanusha
Updated: March 14, 2026 • 7:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ODI World Cup 2027: టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: పాకిస్థాన్‌లో జరిగిన ఈ మెగా టోర్నీని భారత్‌కు అందించి కోచ్‌గా తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడారు.

టీ20 వరల్డ్ కప్ 2026: తాజాగా స్వదేశంలో (భారత్-శ్రీలంక ఆతిథ్యంలో) ముగిసిన టీ20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టును విజేతగా నిలిపారు.దీనితో భారత జట్టు కోచ్‌గా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి వ్యక్తిగా గంభీర్ రికార్డు సృష్టించారు.

Read Also: Saina Nehwal: బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

దక్షిణాఫ్రికా గడ్డపై ‘నిజమైన పరీక్ష’

అయితే గంగూలీ అభిప్రాయం ప్రకారం గంభీర్‌కు నిజమైన పరీక్ష ఇంకా మిగిలే ఉంది. అది ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2027 రూపంలో ఎదురుకానుంది. ఈ టోర్నీ దక్షిణాఫ్రికాలో జరగనుండటంతో అక్కడి పరిస్థితులు జట్టుకు సవాల్‌గా మారవచ్చని ఆయన తెలిపారు. మజూందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ “వైట్ బాల్ క్రికెట్‌లో గంభీర్‌కు అసలు పరీక్ష 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్‌లోనే ఉంటుంది. అక్కడి పరిస్థితులు అతనిని పరీక్షిస్తాయి. అయితే అతని దగ్గర ఉన్న జట్టుతో అతను విజయం సాధిస్తాడని నాకు నమ్మకం ఉంది” అని అన్నాడు.

ODI World Cup 2027: Gambhir’s real test will be then: Ganguly

గంగూలీ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. “రెడ్ బాల్ క్రికెట్‌లో గంభీర్ ఇంకా మెరుగుపడాలి. పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి పిచ్‌లు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంగ్లాండ్ సిరీస్‌ను చూడండి, అక్కడ పిచ్‌పై అతనికి ఎలాంటి నియంత్రణ లేదు” అని గంగూలీ వ్యాఖ్యానించాడు.“గౌతమ్ గంభీర్ మంచి కోచ్. అతనికి కొంత సమయం ఇవ్వాలని నేను ముందే చెప్పాను. వైట్ బాల్ క్రికెట్‌లో అతను చాలా మంచి కోచ్. అతని వద్ద మంచి జట్టు ఉంది,” అని గంగూలీ అన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ganguly Ghambir ODI World Cup 2027

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.